మార్కెటింగ్ మాయ : ఓయో రండి.. కూల్ అవ్వండి.. వాటర్ ప్రాబ్లమ్ లేదు..

మార్కెటింగ్ మాయ : ఓయో రండి.. కూల్ అవ్వండి.. వాటర్ ప్రాబ్లమ్ లేదు..

వ్యాపారానికి కాదేదీ అనర్హం.. తెలివి ఉండాలి కానీ దేన్నయినా డబ్బుగా మార్చుకోవచ్చు.. ఇప్పుడు ఇలాగే చేస్తుంది ఓయో.. బెంగళూరులో విపరీతమైన ఎండలు ఉన్నాయి.. అదే సమయంలో వాటర్ ప్రాబ్లమ్ ఉంది.. దీన్ని క్యాష్ చేసుకుంటుంది ఓయో.. మీ కోసం ఓయో రెడీగా ఉంది.. ఓయోకు రండి కూల్ అవ్వండి.. వాటర్ ప్రాబ్లమ్ కూడా లేదు అంటూ ప్రచారం మొదలుపెట్టింది.. ఏం ఐడియా రా బాబూ అంటూ నెటిజన్లు విస్తుపోతున్నారు.. కొందరు అయితే ఐడియాకు ఫిదా అవుతుంది.. ఇంతకీ వివరాలు ఏంటో చూద్దామా...

ఓయో వ్యవస్థాపకుడు,ఈసీఓ  రితీస్ అగర్వాల్ తన ఎక్స్ హ్యాండీల్‌లో ఓ ప్రమోషనల్ ట్విట్ చేశారు. బెంగుళూల్‌లో కూల్ వెదర్ పోయి హాట్‌గా సమ్మర్ వచ్చేసింది. సిటీలో టెంపరేచర్ చిల్ టూ గ్రిల్‌కు పారిపోయింది. దీనికి తోడు వాటర్ సమస్యకు బెంగళూర్‍ని అతలాకుతలం చేస్తోంది. ఏసీ లేకుండా ఉండలేని వారు ఒకసారి ఓయో హోటల్ బుక్ చేసుకొని సకల సౌకర్యాలు పొందండి అంటూ రాసుకొచ్చాడు. దీనికి పలువురు ప్రముఖులు స్పందిస్తూ వారు ఈమధ్యకాలంలో ఓయో రూంలో స్టే చేసిన ఫొటోస్ షేర్ చేసుకున్నారు. పని మీద బెంగుళూర్ వచ్చిన వారు ఓయో హోటల్స్ లో ఉన్నారు. ఈ పోస్టులపై కొందరు పాసిటీవ్ గా  రియాక్ట్ అయితే.. మరికొందరు బిజినెస్ ప్రమోషన్ అంటూ ఓయో ఈసీఓపై మండిపడుతున్నారు.