ప్రభుత్వాధినేతగా 25వ ఏడాదిలోకి అడుగుపెడుతున్నా.. నాకు మద్దతిస్తున్న దేశ ప్రజలందరికీ కృతజ్ఞతలు

ప్రభుత్వాధినేతగా 25వ ఏడాదిలోకి అడుగుపెడుతున్నా.. నాకు మద్దతిస్తున్న దేశ ప్రజలందరికీ కృతజ్ఞతలు
  • దేశ పురోగతికి నావంతు ప్రయత్నం కొనసాగిస్తూనే ఉన్నా
  • వికసిత్​ భారత్‌‌‌‌ విజన్​ సాకారానికి కొత్త సంకల్పంతో పనిచేస్తా
  • నాడు సీఎం, పీఎంగా ప్రమాణం చేసిన ఫొటోలు ‘ఎక్స్’లో షేర్​


న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ప్రజా సేవలోకి వచ్చి 24  ఏండ్లు పూర్తిచేసుకొని.. 25వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా . 2001లో సరిగ్గా ఇదేరోజు నాటి చిత్రాలను మంగళవారం (అక్టోబర్ 07) ‘ఎక్స్’లో షేర్ చేశారు. గుజరాత్​ సీఎంగా.. అనంతరం దేశ ప్రధానిగా ప్రమాణం చేస్తున్న పాత ఫొటోలను పంచుకున్నారు.  

పాతికేండ్లుగా తనకు మద్దతు ఇస్తున్న దేశ ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు చెప్పారు. పాత జ్ఞాపకాలను నెమరేసుకున్నారు. ‘‘2001లో సరిగ్గా ఇదేరోజున గుజరాత్​ సీఎంగా మొదటిసారి నేను ప్రమాణం చేశాను. అప్పటినుంచి నాకు మద్దతుగా నిలుస్తున్న ప్రజలందరికీ థ్యాంక్స్. ప్రభుత్వాధినేతగా నేను 25వ సంవత్సరంలోకి అడుగుపెట్టాను. ఈ ప్రయాణంలో ప్రజల జీవితాలు మెరుగుపర్చడం కోసం, ఈ గొప్ప దేశ పురోగతికి నావంతు ప్రయత్నం కొనసాగిస్తూనే ఉన్నా ’’ అని వ్యాఖ్యానించారు. వికసిత్‌‌‌‌ భారత్​ విజన్‌‌‌‌ను సాకారం చేసేందుకు కొత్త సంకల్పంతో పనిచేస్తానని ప్రతిజ్ఞ చేశారు. 

విపత్కర పరిస్థితుల్లో సీఎం అయ్యా

విపత్కర పరిస్థితుల్లో గుజరాత్‌‌‌‌ సీఎం బాధ్యతలను చేపట్టానని మోదీ గుర్తు చేసుకున్నారు. భారీ భూకంపం, సూప‌‌‌‌ర్ సైక్లోన్‌‌‌‌, వ‌‌‌‌రుస క‌‌‌‌ర‌‌‌‌వుల‌‌‌‌తో స‌‌‌‌త‌‌‌‌మ‌‌‌‌తం అవుతున్న గుజ‌‌‌‌రాత్‌‌‌‌ను త‌‌‌‌న చేతుల్లో పెట్టార‌‌‌‌ని చెప్పారు. ఆ సవాళ్లే ప్రజలకు సేవ చేయాలనే, గుజరాత్‌‌‌‌ను పునర్నిర్మించాలనే సంకల్పాన్ని బలోపేతం చేశాయని తెలిపారు. 

తొలిసారి సీఎంగా ప్రమాణంచేసే సమయంలో తన తల్లి రెండు మాటలు చెప్పిందని గుర్తు చేసుకున్నారు. ఎల్లప్పుడూ పేదలకోసమే పనిచేయాలని, ఎప్పటికీ లంచం తీసుకోవద్దని చెప్పారన్నారు. అందుకే తాను ఏది చేసినా ఉత్తమమైన ఉద్దేశం ఉంటుందని, క్యూలో చివరి వ్యక్తికి కూడా సేవ చేయాలనే దార్శనికతతో పనిచేస్తానని తెలిపారు. యూపీఏ పాలనతో విసిగిపోయిన దేశ ప్రజలు.. ఎన్డీయేకు భారీ మెజార్టీ కట్టబెట్టడంతో 2014లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టినట్టు చెప్పారు. 

ఈ 11 ఏండ్లలో ప్రజలతో కలిసి దేశంలో అన్ని రంగాల్లోనూ ఎంతో విజయం సాధించామని చెప్పారు. 25 కోట్లకు పైగా ప్రజలు పేదరికం బారి నుంచి విముక్తి పొందారని చెప్పారు.  దేశాన్ని అన్ని రంగాల్లో ఆత్మనిర్భర్‌‌‌‌గా మార్చడమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తానని, ఎప్పటికీ ప్రజాసేవకే కట్టుబడి ఉంటానని పేర్కొన్నారు.