Nepal Unrest..నేపాల్ జైలునుంచి తప్పించుకుని..భారత్ సరిహద్దుల్లో 35 మంది ఖైదీలు అరెస్ట్

Nepal Unrest..నేపాల్ జైలునుంచి తప్పించుకుని..భారత్ సరిహద్దుల్లో 35 మంది ఖైదీలు అరెస్ట్

నేపాల్లో అల్లర్లతో దేశవ్యాప్తంగా పలు జైళ్లనుంచి ఖైదీలు తప్పించుకుని పారిపోయారు. నిరసనకారులు తమ మద్దతుదారులను విడిపించే క్రమంలో దాదాపు రెండు డజన్లకుపైగా జైళ్లనుంచి 15 వేల మందికిపైగా ఖైదీలు పరారయినట్లు అక్కడి అధికారులు ప్రకటించారు. పారిపోయిన ఖైదీల్లో కొంతమంది భారత్ లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. దీంతో భారత్, నేపాల్ సరిహద్దుల్లో భద్రతా బలగాలు వారిని అరెస్ట్ చేశాయి.

ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు చెలరేగినప్పటి నుంచి నేపాల్ దేశవ్యాప్తంగా 25 జైళ్లు కూడా ధ్వంసం చేశారు ఆందోళనకారులు. దాదాపు ఈ జైళ్లనుంచి15వేల మంది ఖైదీలు పారిపోయారు. భద్రతాదళాలతో జరిగిన ఘర్షణల్లో ఎనిమిది మంది ఖైదీలు మృతిచెందారు. 

►ALSO READ | నేపాల్ అల్లర్లు..25 జైళ్లు ధ్వంసం..15వేలమంది ఖైదీలు పారిపోయారు

మరోవైపు భారత్ లో ప్రవేశించేందుకు ప్రయత్నించిన 35 మంది పారిపోయిన నేపాల్ ఖైదీలను సరిహద్దుల్లో సశస్త్ర సీమా బల్ (SSB) అరెస్టు చేసింది.వీరిలో ఉత్తరప్రదేశ్‌లోని సరిహద్దులో 22 మంది, బీహార్‌లో 10 మంది ,బెంగాల్‌లో ముగ్గురిని అరెస్ట్ చేశారు.