కేసీఆర్ చెప్పినట్లుగా పంటలు వేసిన రైతులకు బోనస్ ఇవ్వాలి

కేసీఆర్ చెప్పినట్లుగా పంటలు వేసిన రైతులకు బోనస్ ఇవ్వాలి

సీఎం కేసీఆర్ రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైయ్యారని ఆరోపించారు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి. తాను రైతునని చెప్పుకునే కేసీఆర్…రైతులకు అండగా ఎందుకు ఉండటం లేదన్నారు. కేసీఆర్ చెప్పిన విధంగా పంటలు వేసిన రైతులకు బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతులకు కనీస మద్దతు ధరను ఇవ్వకుండా… రైతు చనిపోతే రైతు బీమా ఇస్తామని చెప్పడం దారుణమన్నారు.

పల్లీలు, బఠానీలకు భూములను లాక్కున్న ప్రభుత్వం… అవే భూములను ప్రైవేట్ కంపెనీలకు కోట్లకు అమ్ముకుంటోందని విమర్శించారు రేవంత్. కడ్తాల్, కందుకూరు రైతుల మీద పెట్టిన కేసులను ఎత్తేయాలని డిమాండ్ చేశారు. అంతేకాదు..కుప్పగండ్లతో ఇద్దరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గిరిజనులకు చెందిన 400 ఎకరాల భూములను తమవారి పేరు మీద బదిలీ చేయించుకున్నారని…వాటిని వెంటనే గిరిజనులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆ భూముల దగ్గరకు తాము వెళ్తామని హెచ్చరించారు. తెలంగాణకు పట్టిన గులాబీ చీడను వదిలించాల్సిన సమయం ఆసన్నమైందని… మనకోసం ఎవరూ రారని, మనకు మనమే దిక్కన్నారు. రాష్ట్ర భవిష్యత్తును కాపాడుకోవడానికి యువత ముందుకు రావాలని సూచించారు రేవంత్ రెడ్డి.