Jana Nayagan Losses: ‘జన నాయగన్’ వాయిదా.. ఇండియన్ సినీ చరిత్రలోనే అతిపెద్ద టికెట్ రిఫండ్.. ఎన్ని కోట్లంటే?

Jana Nayagan Losses: ‘జన నాయగన్’ వాయిదా.. ఇండియన్ సినీ చరిత్రలోనే అతిపెద్ద టికెట్ రిఫండ్.. ఎన్ని కోట్లంటే?

దళపతి విజయ్ నటించిన ‘జన నాయగన్’ సినిమా విడుదలకు కేవలం రెండు రోజుల ముందే వాయిదా పడింది. ఈ చిత్రాన్ని జనవరి 9న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ముందుగానే ప్రకటించడంతో పాటు, భారత్‌లోని కొన్ని థియేటర్లతో పాటు ఓవర్సీస్ మార్కెట్‌లో కూడా అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్‌ను ఓపెన్ చేశారు.

అయితే, విడుదలకు ముందే సెన్సార్ సర్టిఫికెట్ లభించకపోవడం వల్ల సినిమా విడుదలను వాయిదా వేయాల్సి వచ్చింది. ఈ అనూహ్య నిర్ణయం కారణంగా సినిమాకు దాదాపు రూ.50 కోట్ల వరకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సినిమా వాయిదా నేపథ్యంలో, బుక్‌మైషో సహా పలు బుకింగ్ వెబ్‌సైట్లు ఇప్పటికే బుక్ చేసుకున్న టికెట్లకు రిఫండ్ ప్రక్రియను ప్రారంభించాయి.

ALSO READ : డార్లింగ్ అంటే ఈయనే.. 

టికెట్ రిఫండ్స్ ప్రారంభం.. 

ఈ వాయిదా నేపథ్యంలో బుకింగ్ వెబ్ సైట్స్ టికెట్ రిఫండ్ ప్రక్రియ ప్రారంభం చేశారు. బుధవారం వరకు బుక్‌మైషో వేదికగా దాదాపు 4.50 లక్షల టికెట్లు అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో అమ్ముడైనట్లు సమాచారం. ఇప్పుడు ఆ టికెట్లకు సంబంధించిన మొత్తం డబ్బును బుక్‌మైషో తిరిగి చెల్లించే ప్రక్రియను ప్రారంభించింది.

ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం, ఇది బుక్‌మైషో చరిత్రలోనే అతిపెద్ద టికెట్ రిఫండ్ కాగా, ఇండియన్ సినీ చరిత్రలో కూడా ఈ స్థాయిలో టికెట్లు క్యాన్సిల్ అయి, రిఫండ్ ఇవ్వడం ఇదే తొలిసారి అని చెబుతున్నారు. మరోవైపు, థియేటర్లలో నేరుగా టికెట్లు బుక్ చేసుకున్న ప్రేక్షకులకు అక్కడికక్కడే రిఫండ్స్ అందిస్తున్నారు. 

ALSO READ : హైదరాబాద్ క్రైమ్ కథతో శోభిత మూవీ..

ప్రీ-సేల్స్‌లో ‘జన నాయగన్’ ఎంత వసూలు చేసింది?

విజయ్ ఇదే తన రాజకీయాల్లోకి పూర్తిస్థాయిలో వెళ్లే ముందు చివరి సినిమా అని ప్రకటించడంతో ఫ్యాన్స్‌లో అంచనాలు ఆకాశాన్ని తాకాయి. రిలీజ్ దగ్గరపడే కొద్దీ టికెట్ డిమాండ్ భారీగా పెరిగింది. చెన్నైలో కొన్ని లోకల్ థియేటర్ల వద్ద బ్లాక్ మార్కెట్‌లో టికెట్ ధరలు రూ.5,000 వరకు వెళ్లినట్లు సమాచారం. 

ALSO READ : నంబర్ 1 ట్యాక్స్ పేయర్ రష్మిక..

ఓవర్సీస్ మార్కెట్‌లో రికార్డు జోరు

ఓవర్సీస్ మార్కెట్ లో సంక్రాంతి రిలీజ్‌లలో ప్రభాస్ నటించిన ‘ది రాజా సాబ్’ సహా ఇతర సినిమాలన్నింటికంటే జన నాయగన్ ముందంజలో ఉండే. ఓపెనింగ్ డే ప్రీ-సేల్స్ ద్వారానే దాదాపు రూ.32 కోట్లు వసూలు చేయడం విశేషం. ముఖ్యంగా నార్త్ అమెరికా, యూకే, మలేషియా వంటి మార్కెట్లలో అద్భుతమైన బుకింగ్స్ నమోదయ్యాయి. 

సినిమా వాయిదా వల్ల బాక్సాఫీస్‌పై ప్రభావం.. 

చివరి నిమిషంలో సినిమా విడుదల రద్దు కావడం వల్ల.. ఓవర్సీస్ థియేటర్ చైన్స్ ఇకపై అంత భారీగా స్క్రీన్లు కేటాయించే అవకాశాలు తగ్గవచ్చని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఇది సినిమాకు అంతర్జాతీయంగా ఆర్థిక నష్టాన్ని కలిగించే ప్రమాదం ఉంది. 

యూకే డిస్ట్రిబ్యూటర్ Ahimsa Entertainment.. 

యూకేలో ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ అయిన Ahimsa Entertainment సినిమా వాయిదా సందర్భంగా కీలక గణాంకాలను వెల్లడించింది. యూకేలో 260+ థియేటర్లు, వేలాది షోలు తమిళ సినిమాకు రికార్డ్ స్థాయిలో జరిగిందని వెల్లడించింది. రాత్రి 12:30 (భారత కాలమానం ప్రకారం ఉదయం 6) ప్రీమియర్ షోలు, అప్పటికే 65,000కి పైగా టికెట్లు అమ్ముడయ్యాయి. ‘LEO’ సినిమా స్థాయిలో ప్రీ-సేల్స్ ట్రెండ్ అవుతోందని యూకే డిస్ట్రిబ్యూటర్ అహింస తెలిపింది. “ఇవి కేవలం పెద్ద నంబర్లు మాత్రమే కాదు.. మరో రికార్డ్ సెట్ కావడానికి చాలా దగ్గరలో ఉంది” అని యూకే డిస్ట్రిబ్యూటర్ వెల్లడించింది. 

ఓవర్సీస్ & ఇండియాలో థియేటర్ల రీ-షఫ్లింగ్.. 

ఈ వాయిదా ప్రభావం, ఒక్క Ahimsa Entertainment‌కే కాదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలువురు ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లకూ ఎదురవుతోంది. సంక్రాంతికి ఇప్పటికే అనేక సినిమాలు లైన్‌లో ఉండటంతో.. ‘జన నాయగన్’ మళ్లీ విడుదలైనప్పుడు అదే స్థాయిలో థియేటర్లు దొరుకుతాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ట్రేడ్ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, ఈ ఘటన వల్ల ఓవర్సీస్ మార్కెట్‌లో తమిళ సినిమాల నమ్మకత్వంపై ప్రభావం పడే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.