మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్ లో రూపుదిద్దుకున్న చిత్రం 'మన శంకర వరప్రసాద్ గారు' . పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా జనవరి 12న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. సంక్రాంతికి కానుకగా వస్తున్న ఈ మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ మూవీ తర్వాత తన 158 వ చిత్రాన్ని పట్టాలెక్కించబోతున్నారని తెలుస్తోంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన వార్త ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది.
చిరు సరసన ఐశ్వర్య?
'వాల్తేరు. వీరయ్య' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత దర్శకుడు బాబీ కొల్లి తో చిరు చేస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలున్నాయి. ఈ ప్రాజెక్ట్ లో చిరుకి జోడిగా చాలా మంది హీరోయిన్స్ పేర్లు వినపడ్డాయి. అయితే ఇప్పుడు మాత్రం ఐశ్వర్యరాయ్ హీరోయిన్ గా నటించబోతోందనే టాక్ వినిపిస్తోంది. ఈ వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇదే నిజమైతే బాక్సాఫీస్ వద్ద రికార్డులు ఖాయం అంటున్నారు అభిమానులు.
ALSO READ : ‘జన నాయగన్’ వాయిదా..
ఈ సినిమా కేవలం క్యా స్టింగ్ పరంగానే కాకుండా టెక్నికల్ గానూ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ ఈ చిత్రాని కి సంగీతం అందించబోతున్నా రని సమాచారం. అలాగే మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఒక పవర్ఫుల్ క్యామియో చేయనున్నారట. కోల్ కతా బ్యాక్ డ్రాప్ లో సాగే ఒక రస్టిక్ గ్యాంగ్ స్టర్ యాక్షన్ డ్రామాగా బాబీ ఈ కథను సిద్ధం చేస్తున్నారు. అయితే ఈ మూవీలో తారగణంపై మేకర్స్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
ఫిబ్రవరిలో లాంచ్..
నిజానికి ఈ సినిమాను జనవరి 18నే ప్రారంభించాలని మేకర్స్ తొలుత భావించారు. అయితే చిరంజీవి ఇటీవలే మోకాలి సర్జరీ చేయించుకోవడంతో .. ఆయన కోలుకోవడానికి కొంత సమయం పడుతుందన్న ఉద్దేశంతో ఈ సినిమా షూటింగ్ వాయిదా వేశారు. లేటెస్ట్ సమాచారం ప్రకారం ఈ భారీ ప్రాజెక్ట్ ఫిబ్రవరి 2026లో అధికారికంగా లాంచ్ కానుంది. మార్చి నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించేందుకు ఈ మూవీ టీమ్ ప్లాన్ చేస్తోంది.
ALSO READ : డార్లింగ్ అంటే ఈయనే..
బాక్సాఫీస్ వద్ద 'మన శంకర వరప్రసాద్ గారు' ..
చిరంజీవి 'మన శంకర వరప్రసాద్ గారు' జనవరి 12న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. ఇందులో చిరంజీవి ఒక మాజీ NIA ఆఫీసర్‌గా కనిపిస్తుండగా, లేడీ సూపర్‌స్టార్ నయనతార 'శశిరేఖ' సంపన్న యువతిగా మెగాస్టార్ సరసన నటిస్తోంది. ముఖ్యంగా విక్టరీ వెంకటేష్ ఈ సినిమాలో ప్రత్యేక కేమియో పాత్రలో కనిపిస్తుండటం సినిమాపై అంచనాలను ఆకాశానికి తీసుకెళ్లింది. మరి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.
ALSO READ : హైదరాబాద్ క్రైమ్ కథతో శోభిత మూవీ..
