మేడారం జాతరకు రండి..ఫామ్ హౌస్ లో కేసీఆర్ కు మంత్రుల ఆహ్వానం

మేడారం జాతరకు రండి..ఫామ్ హౌస్ లో కేసీఆర్ కు మంత్రుల  ఆహ్వానం

సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో మాజీ సీఎం కేసీఆర్ తో  మహిళా మంత్రులు సీతక్క, కొండా సురేఖ భేటీ అయ్యారు.  జనవరి 28 నుంచి  మేడారంలో తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న సమ్మక సారక్క జాతరకు రావాలని కేసీఆర్ ను ప్రత్యేకంగా ఆహ్వానించారు మంత్రులు .

అనంతరం ఫామ్ హౌస్ బయట మీడియాతో మాట్లాడిన మంత్రులు సీతక్క, కొండా సురేఖ..మేడారం జాతరకు తమ ఆహ్వానాన్ని  కేసీఆర్ స్వీకరించినట్లు చెప్పారు.  కేసీఆర్ మేడారం వచ్చి అమ్మలను దర్శించుకుంటారని మంత్రులు చెప్పారు. అన్ని పార్టీ ఫ్లోర్ లీడర్లను మేడారం జాతరకు ఆహ్వానించినట్లు  చెప్పారు . కేసీఆర్ తమకు చీరలు పెట్టడం సంతోషంగా ఉందన్నారు. 

ALSO READ : ఫిబ్రవరి 3 నుంచి ..9 జిల్లాల్లో సీఎం బహిరంగ సభలు

 జనవరి 28 నుంచి 31వ తేదీ వరకు మేడారం జాతర జరగనుంది.   మొదటి రోజైన జనవరి 28 బుధవారం రోజున కన్నెపల్లి నుంచి సారలమ్మ, కొండాయి నుంచి గోవిందరాజులు, పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజు మేడారంలోని గద్దెలపైకి చేరుకోనున్నారు. 29న చిలుకలగుట్ట నుంచి సమ్మక్కను తీసుకొచ్చి గద్దెపై ప్రతిష్ఠిస్తారు. 30న భక్తులు మొక్కులు సమర్పించనున్నారు. 31న సాయంత్రం 6 గంటలకు అమ్మవార్లను తిరిగి వనప్రవేశం చేయడంతో మహా జాతర ముగియనున్నది. 

ALSO READ : రైలు టికెట్స్ బుక్ చేసుకునే వారికి లాస్ట్ ఛాన్స్..

మహాజాతర సందర్భంగా భక్తుల సౌకర్యార్థం  తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేకంగా 3,495 ఆర్టీసీ బస్సులు నడుపుతోంది. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూడాలని, మెరుగైన రవాణా సేవలు అందించేందుకు సిద్ధమవుతోంది.  గత జాతరలో జరిగిన అనుభవాలను దృష్టిలో ఉంచుకొని రవాణా సౌకర్యం, బస్సుల ఏర్పాటు విషయంలో ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నారు.  తాడ్వాయి నుంచి మేడారం చేరుకునే అటవీ మార్గం మధ్యలో సెల్‌‌ఫోన్‌‌ సిగ్నల్‌‌ సమస్య ఉండటంతో కమ్యూనికేషన్‌‌ కోసం ప్రతి కిలోమీటర్‌‌కు ఓ పోలీస్‌‌ టీంను ఏర్పాటు చేస్తున్నారు.