దూర ప్రయాణాలు వెళ్లాలనుకునే వారు ముందే టికెట బుక్ చేసుకుంటుంటారు కదా. అప్పటిప్పకుడు టికెట్స్ దొరకక, అనుకున్న కంపార్టుమెంట్లలో సీట్లు దొరకక ఇబ్బందులు పడేకంటే.. ముందే బుక్ చేసుకుంటే ప్రశాంతంగా ఉండొచ్చునని ముందుగానే బుక్ చేసుకుంటుంటారు. IRCTC కూడా 60 రోజుల ముందే బుకింగ్ చేసుకునే సదుపాయం కల్పించింది. కానీ.. ఈ రూల్స్ ఫాలో కాకపోతే బుకింగ్స్ ఓపెన్ అయిన వెంటనే బుక్ చేసుకోలేరు. అందరూ అయిపోయాక.. అర్థరాత్రి తర్వాత మాత్రమే మీకు విండో ఓపెన్ అవుతుంది.
ఐఆర్సీటీసీ తెచ్చిన ఈ కొత్త రూల్ చాలా మందికి తెలిసే ఉంటుంది. టికెట్ బుకింగ్ చేసుకోవాలంటే IRCTC యూజర్లు వారి అకౌంట్ కు ఆధార్ లింక్ చేసుకోవడం తప్పనిసరి. బుకింగ్స్ ఓపెన్ అయిన వెంటనే.. అంటే 60 రోజుల ముందునుంచే ఎర్లీగా టికెట్స్ కన్ఫమ్ చేసుకోవాలంటే ఆధార్ లింక్ చేసుకున్నవాళ్లకే చాన్స్. దశలవారీగా ఈ నిబంధనను అమలు చేస్తోంది రైల్వే బుకింగ్స్ యాప్.
ALSO READ : సిట్ విచారణకు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు
- మొదటి దశ: డిసెంబర్ 29 నుంచి.. ఆధార్ లింక్ చేయని వారు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల టికెట్ బుక్ చేసుకోవడం కుదరదు.
- రెండవ దశ: జనవరి 5 నుంచి.. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు టికెట్ బుక్ చేసుకోవడం కుదరదు.
- మూడవ దశ: జనవరి 12 నుంచి.. ఉదయం 8 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు టికెట్ బుక్ చేసుకోలేరు.
ఆధార్ లింక్ లేని వాళ్లు ఆ తర్వాత.. అంటే అర్ధరాత్రి తర్వాత మాత్రమే బుక్ చేసుకునే చాన్స్ ఉంటుంది. అంటే అప్పటి వరకు టికెట్స్ అందుబాటులో ఉంటాయా ఉండవా అనేది యూజర్లే ఆలోచించుకుకోవాలి.
ALSO READ : కోటి కంటే ఖరీదైన ఇళ్లకే మస్త్ డిమాండ్..
కారణం ఇదే:
దశల వారీగా ఆధార్ లింక్ లేని యూజర్లు టికెట్స్ బుక్ చేసుకునే సదుపాయాన్ని తగ్గించడం వెనుక.. ఫేక్ అకౌంట్స్ నుంచి టికెట్స్ బుకింగ్స్ ను అడ్డుకోవడమేనని ఐఆర్సీటీసీ చెబుతోంది. దీంతో వీలైనంత ఎక్కువ శాతం ప్యాసెంజర్లకు టికెట్స్ బుక్ చేసుకునే అవకాశం ఉంటుందని తెలిపింది.
