కొనసాగుతున్న కొమురవెల్లి మల్లన్న బ్రహ్మోత్సవాలు

కొనసాగుతున్న కొమురవెల్లి మల్లన్న బ్రహ్మోత్సవాలు
  • ఆదివారంకు భారీగా తరలివచ్చిన భక్తులు

కొమురవెల్లి, వెలుగు: కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయంలో జాతర బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. శనివారం నుంచే ఆలయానికి చేరుకున్న  భక్తులు ఆదివారం మల్లన్న స్వామికి బోనాలు, పట్నాలు, అభిషేకం, ముడుపులు, తిరుగుడు కోడె కట్టి మొక్కులు చెల్లించుకున్నారు. ధర్మదర్శనం, విశిష్ట, వీవీఐపీ దర్శనం ద్వారా 50 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయ వర్గాలు వెల్లడించాయి. ధర్మదర్శనానికి మూడు గంటల సమయం పట్టింది. అనంతరం కొండపై ఉన్న రేణుక ఎల్లమ్మను దర్శించుకొని బోనాలు సమర్పించారు. 

ఈఓ వెంకటేశ్, ఉత్సవ కమిటీ చైర్మన్ గంగం నర్సింహా రెడ్డి, ఏఈఓలు రావుల సుదర్శన్, బుద్ది శ్రీనివాస్, ప్రధానార్చకుడు మహాదేవుని మల్లికార్జున్, అర్చకులు, ధర్మకర్తలు సార్ల లింగం, బొచ్చు ఎల్లయ్య, ప్రవీణ్ యాదవ్, ఆలయ సిబ్బంది, ఒగ్గు పూజారులు భక్తులకు సేవలందించారు. సీపీ రష్మీ పెరుమాల్ ఆదేశాల మేరకు ఏసీపీ సదానందం ఆధ్వర్యంలో పోలీసులు పటిష్ట బందోబస్త్ నిర్వహించారు.