రథసప్తమి వేడుకలకు తిరుమల తిరుపతి దేవస్థానం ముస్తాబవుతోంది. జనవరి 25న జరగనున్న వేడుకల ఏర్పాట్లపై టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి గురువారం (జనవరి 08) సమీక్షా సమావేశం నిర్వహించారు. వేడుకల వైకుంఠ ద్వార దర్శనాలను విజయవంతం చేసినట్లుగానే.. రథ సప్తమి పర్వదినాన్ని అద్భుతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు.
టీటీడీ అధికారులు, విజిలెన్స్ సెక్యూరిటీ, పోలీసులతో సమన్వయం చేసుకుని ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. ముందస్తుగా భక్తుల రద్దీని అంచనా వేసుకుని ట్రాఫిక్, పార్కింగ్ , అత్యవసర టీమ్స్ లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు.
ALSO READ : రైలు టికెట్స్ బుక్ చేసుకునే వారికి లాస్ట్ ఛాన్స్..
సమగ్ర బందోబస్తు పై ముందస్తు ప్రణాళికలు రూపొందించాలని, ఘాట్ రోడ్డు వాహనాల కదలికను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, అత్యవసర పరిస్థితుల్లో వాహనాలను తరలించేలించేందుకు వీలుగా కార్యాచరణ రూపొందించాలని కోరారు. ప్రతి ఒక్కరూ సమాచారాన్ని ఎప్పటికప్పుడు చేరవేసేలా సమన్వయం చేసుకోవాలని ఆయన ఆదేశించారు.
ఇంజినీరింగ్, అన్నప్రసాదం, పారిశుద్ధ్యం, శ్రీవారి సేవకులు, వైద్య బృందాలు, ఎల్ ఈ డీ స్క్రీన్లు, పుష్పాలంకరణ, సాంస్కృతిక కళా బృందాలు, ఎస్వీబీసీ, సోషియల్ మీడియాలో ప్రచారం ఇతర ఏర్పాట్లపై సమీక్షించారు.
ALSO READ : తిరుమల పవిత్రతను దెబ్బతీసే కుట్ర బయటపెట్టిన పోలీసులు
వాహనసేవల వివరాలు :
- తెల్లవారుజామున 5.30 నుంచి 8 గంటల వరకు (సూర్యోదయం ఉదయం 6.45 గంటలకు) – సూర్యప్రభ వాహనం.
- ఉదయం 9 నుంచి 10 గంటల వరకు – చిన్నశేష వాహనం.
- ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు – గరుడ వాహనం.
- మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల వరకు – హనుమంత వాహనం.
- మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు – చక్రస్నానం.
- సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు – కల్పవృక్ష వాహనం.
- సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు – సర్వభూపాల వాహనం.
- రాత్రి 8 నుంచి 9 గంటల వరకు – చంద్రప్రభ వాహనం.
ALSO READ : శ్రీశైలంలో 777 అడుగుల నుంచి తెలంగాణ నీళ్లను ఎత్తుకెళుతుంది
ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలు రద్దు :
- రథసప్తమి వేడుకల సందర్భంగా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పలు ప్రత్యేక సేవలు రద్దు చేస్తున్నట్లు అదనపు ఈవో ప్రకటించారు.
- కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలు రద్దు
- ఎన్.ఆర్.ఐలు, చంటి బిడ్డల తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్లు, వికలాంగుల ప్రివిలేజ్ దర్శనాల రద్దు
- తిరుపతిలో జనవరి 24 నుండి 26వ తేది వరకు స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లు జారీ రద్దు.
- ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు, బ్రేక్ దర్శనాలకు సంబంధించి జనవరి 24న ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించబడవు.
ఈ సమావేశంలో టీటీడీ జేఈవో శ్రీ వీరబ్రహ్మం, సీవీఎస్వో శ్రీ మురళీకృష్ణ, తిరుమల అదనపు ఎస్పీ శ్రీ రామకృష్ణలతో కలిసి రథ సప్తమి రోజున భద్రత, భక్తుల రద్దీ నిర్వహణ, తదితర అంశాలపై సమీక్షించారు.
