17 రోజుల్లోనే వ్యాక్సినేషన్ పూర్తి!

17 రోజుల్లోనే వ్యాక్సినేషన్ పూర్తి!

రాష్ట్రంలో కరోనా తీవ్రత పెరుగుతుండటంతో మే 1 నుంచి 18 ఏళ్లు పైబడిన వారందరికీ వ్యాక్సిన్ వేయాలని సర్కార్ ప్లాన్ చేసింది. దానికి సంబంధించి కాన్సెప్ట్ నోట్‌ను వైద్యశాఖ రిలీజ్ చేసింది. రాష్ట్రంలో 18 నుంచి 44 ఏళ్ల లోపు ఉన్నవారు 1 కోటి 72 లక్షల 41 వేల 110 మంది ఉన్నట్లు గుర్తించారు. వీరందరికీ రెండు డోసుల వ్యాక్సిన్ వేయాలంటే 4 కోట్ల డోసుల వ్యాక్సిన్ అవసరమని వైద్యశాఖ వెల్లడించింది. ఈ వ్యాక్సినేషన్ కోసం రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్, ప్రభుత్వ ఆస్పత్రులలో 5 వేల వ్యాక్సిన్ సెంటర్లు ఏర్పాటు చేయాలని వైద్యశాఖ భావిస్తోంది. అయితే ప్రభుత్వం చెప్పిన లెక్కల ప్రకారం వ్యాక్సిన్ వేస్తే 17 రోజుల్లోనే వ్యాక్సినేషన్ పూర్తవుతుంది.

అయితే ప్రభుత్వం విడుదల చేసిన కాన్సెప్ట్ నోట్‌పై నిపుణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రోజూ 10 లక్షల మందికి వ్యాక్సినేషన్ సాధ్యమేనా అని అనుమానపడుతున్నారు.