చేపలను కాపాడుకునేందుకు మత్స్యకారుల తంటాలు

చేపలను కాపాడుకునేందుకు మత్స్యకారుల తంటాలు

మత్స్యకారుల మధ్య వర్షం చిచ్చు  పెట్టింది. నాలుగైదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. దీంతో చెరువులు కుంటలు నిండు కుండల్లా మారాయి. చెరువులు, రోడ్లు ఏకం కావడంతో వరద నీటిలో  చేపలు ఎదురెక్కుతున్నాయి. దీంతో చేపలను కాపాడుకునేందుకు మత్స్యకారులు తంటాలు పడుతున్నారు. ఒక చెరువులోని చేపలు మరో చెరువులోకి ఎదురు ఎక్కడంతో చేపలు మావేనని మత్స్యకారులు ఘర్షణ పడుతున్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ గర్రపల్లి పెద్ద చెరువులోని చేపలు పెద్ద మొత్తంలో మగ్దుంపూర్, చెర్లబూత్కూర్ వైపు వరద ప్రవాహానికి ఎదురెక్కడంతో మూడు గ్రామాల మత్స్యకారులు చేపలు విషయంలో తీవ్ర ఘర్షణ పడ్డారు. ఇదే టైంలో వరదల్లో వస్తున్న చేపలు పట్టేందుకు జనం కూడా ఎగబడ్డారు. కొన్నిచోట్ల వందరూపాయలకు ఐదు కిలోల చేపలు ఇవ్వడంతో పెద్ద మొత్తంలో కొనుగోలు చేస్తున్నారు.