
తమిళనాడులో ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఈ క్రమంలో రాజకీయ పార్టీలు ఎన్నికల సమరానికి సిద్దమవుతున్నారు. తమిళనాడులో కొత్త పార్టీ తమిళిగ వెట్రి కజగ్ (టీవీకే) పార్టీ పెట్టిన సినీ నటుడు విజయ్..తొలిసారి ఎన్నికల్లో బరిలోకి దిగుతున్నారు. అధికార ప్రతిపక్ష పార్టీలకంటే ముందే ఎన్నికల శంఖారావం పూరిస్తున్నారు. సెప్టెంబర్ 13 నుంచి ఎన్నికల ప్రచారానికి సిద్దమవుతున్నారు ఈ క్రమంలో తనకు భద్రత ఏర్పాటు చేయాలని తమిళనాడు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌కు లెటర్ రాశారు.
తమిళిగ వెట్రి కజగ్(టీవీకే) పార్టీ చీఫ్ విజయ్ శనివారం (సెప్టెంబర్ 13) నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రచారం మొదలుపెట్టనున్నారు. విజయ్ రాజకీయ పర్యటనకు రక్షణ కల్పించాలని తమిళనాడు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కు లేఖ రాసింది టీవీకే పార్టీ.
డిసెంబర్ 20 వరకు విజయ్ తమిళనాడు వ్యాప్తంగా ఎన్నికల ప్రచారంలో పాల్గగొననున్నట్లు ఆ పార్టీ తెలిపింది. బహిరంగ సభల ద్వారా మొత్తం 38 జిల్లాల్లో ప్రచారం నిర్వహించనున్నారు. ఈ క్రమంలో తగిన పోలీస్ భద్రత, ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు చేపట్టాలని తమిళనాడు డీజీపీని కోరింది టీవీకే పార్టీ.
విజయ్ రాష్ట్ర వ్యాప్త పర్యటన సెప్టెంబర్ 13 న ప్రారంభమై సెప్టెంబర్ 27న చెన్నైకి చేరుతుంది. విజయ్ పర్యటనలు ఎక్కువగా శనివారం ఉండనున్నట్లు పార్టీ తెలిపింది. చివరి ఎన్నికల ప్రచారం డిసెంబర్ 20న మధురైలో జరగనుంది.