బీజేపీ Vs కాంగ్రెస్ ఏ పార్టీకి ఎంత ఆస్తి ఉందో తెలుసా?

బీజేపీ Vs కాంగ్రెస్ ఏ పార్టీకి ఎంత ఆస్తి ఉందో తెలుసా?

లోక్ సభ ఎన్నికల హడావిడి  మొదలవుతున్న వేళ జాతీయ పార్టీలు పార్టీ ఫండ్స్ వివరాలు బయటకు వచ్చాయి. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.719 కోట్ల బీజేపీకి డొనేషన్స్ వచ్చాయని ఎలక్షన్ కమిషన్  తెలిపింది. 2021-22 లో ఇది రూ.614కోట్లు ఉండగా.. కిందటి ఏడాదితో పోల్చుకుంటే ఈ సంవత్సరం 17 శాతం బీజేపీ పార్టీ ఫండ్ పెరిగిందట. ప్రధాని మోదీ ఆరోజు (మార్చి3)న నమో యాప్ ద్వారా భారతీయ జనతా పార్టీకి ఫండ్ గా రూ.2వేలు డొనేట్ చేశారు. ఈ విషయాన్ని ఆయన ఎక్స్ అకౌంట్ లో పోస్ట్ చేశారు.  

మార్చి 1న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రూ.1000  డొనేట్ చేసి పార్టీ విరాళాల సేకరణను ప్రారంభించిన విషయం తెలిసిందే.  కాంగ్రెస్ పార్టీ ఫండ్ మాత్రం గత ఏడాది కంటే ఈ ఏడాది తగ్గిందని కేంద్ర ఎన్నికల కమిషన్ వివరించింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో రూ.95.4 కోట్లు ఉండగా.. 2022-23లో అది  రూ.79 కోట్లకు తగ్గింది. ఇన్కమ్ టాక్స్ యాక్ట్ 1961 ప్రకారం అన్ని రాజకీయ పార్టీలకు వచ్చే విరాళలకు పన్ను మినహాయింపు ఉంటుంది. బిజెపి మొత్తం పార్టీ ఫండ్ లో సగానికిపైగా ఎలక్టోరల్ బాండ్లే ఉన్నాయి. సుప్రీం కోర్టు ఎలక్టోరల్ బాండ్లు రద్దు చేసిన కొన్ని రోజుల తర్వాత బీజేపీ పార్టీ ఫండ్స్ సేకరించడం ప్రారంభించింది.