
జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ)లో జరిగిన హింసాత్మక ఘటనను ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా ఖండించారు. నిరసన చేస్తున్న విద్యార్ధులను ఉద్దేశపూర్వకంగా శిక్షించేందుకే ఈ క్రూరమైన దాడులు జరిగాయని ఆయన ఆరోపించారు. అధికారంలో ఉన్న వారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం వల్లే.. దుండగులు దాడికి తెగబడ్డారని అన్నారు. పిరికిపందల్లాగా ముసుగులు ధరించి యూనివర్శిటి విద్యార్ధులపై రాడ్లు, కర్రలతో దాడి చేయడం ఉపేక్షించలేని చర్యగా ఒవైసీ తెలిపారు. ఈ ఘటనపై కేంద్ర మంత్రులు కూడా నిస్సహాయత వ్యక్తం చేస్తూ ట్వీట్లు చేస్తున్నారని, పోలీసులు ఎందుకు ఆ గూండాలకు రక్షణగా ఉన్నారో మోదీ సర్కార్ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.