ఇమ్రాన్ ఖాన్..మేం భారతీయ ముస్లీంలుగా గర్వపడుతున్నాం: ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ

ఇమ్రాన్ ఖాన్..మేం భారతీయ ముస్లీంలుగా గర్వపడుతున్నాం: ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ

భారత్ లో ముస్లింల గురించి బాధపడేకంటే నీ దేశ పరిస్థితి ఏంటో తెలుసుకో అంటూ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ పాక్ అధ్యక్షుడు ఇమ్రాన్ కు హితువు పలికారు. రెండు రోజుల క్రితం ఇమ్రాన్ ఖాన్ ఓ వీడియో ను ట్వీట్ చేశారు.  ఉత్తర్ ప్రదేశ్ ముస్లీంలపై పోలీసుల దౌర్జన్యం అంటూ వీడియోను విడుదల చేశారు. అయితే ఇమ్రాన్ నకిలీ వీడియో విడుదల చేయడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.

వాస్తవానికి ఆ వీడియో బంగ్లాదేశ్ కు చెందింది. ఏడేళ్ల క్రితం బంగ్లాదేశ్ లో ర్యాపిడ్ యాక్షన్ బెటాలియన్ సైనికులు స్థానికులపై దాడిచేశారు. ఆ దాడిలో స్థానికులకు తీవ్రగాయాలయ్యాయి. ఆ దాడి వీడియోల్ని ఇమ్రాన్  ట్వీట్ చేశారు.

అయితే ఇమ్రాన్ వీడియోలపై మినిస్ట్రీ ఆఫ్ అఫైర్స్ స్పోక్ పర్సన్ రావిష్ కుమార్ స్పందించారు. వీడియోలను ట్వీట్ చేసే ముందు ఒకటికి పదిసార్లు చెక్ చేసుకొని షేర్ చేయాలని సూచించారు. ప్రధాని హోదాలో ఉండి ఇలాంటి వీడియోలను షేర్ చేసేటప్పుడు జాగ్రత్త వహించాలన్నారు.

తాజాగా ఇమ్రాన్ పోస్ట్ చేసిన వీడియోపై అసదుద్దీన్ స్పందించారు. బంగ్లాదేశ్ ఢాకాలో ఆ ఇన్సిండెంట్ జరిగితే  భారత్ లో ముస్లీంలపై దాడి జరిగినట్లు చిత్రీకరించేలా ఇమ్రాన్ ఖాన్ ఫేక్ వీడియోలను పోస్ట్ చేశాడు. భారత్ ముస్లీంలుగా మేం గర్వపడుతున్నాం. ఎప్పటికీ అలాగే ఉంటాం. నువ్వ మాత్రం నీ దేశం గురించి ఆలోచించు,నీ దేశ పరిస్థితి గురించి ఆలోచించు ఇమ్రాన్ అంటూ అసదుద్దీన్ స్పష్టం చేశారు.