అయోధ్య భూమి పూజకు అసదుద్దీన్ ఒవైసీకి ఆహ్వానం

అయోధ్య భూమి పూజకు అసదుద్దీన్ ఒవైసీకి ఆహ్వానం

ఆగష్టు 5న అయోధ్యలో నిర్మించబోయే రామ్ మందిర్ భూమి పూజకు ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసిని బీజేపీ ముఖ్య ప్రతినిధి కృష్ణ సాగర్ రావు ఆహ్వానించారు. ఆ భూమి పూజలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గొని.. అద్భుతమైన రామ్ మందిర నిర్మాణాన్ని ప్రారంభిస్తారని ఆయన అన్నారు. రాముడు జన్మించిన ప్రదేశం అయిన భవ్య రామ్ మందిర్ వద్ద పూజలు మొదలవుతాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది హిందువుల కల సాకారం కాబోతోందని ఆయన అన్నారు. ఈ విషయంలో బీజేపీకి చాలా గర్వంగా ఉందని ఆయన అన్నారు.

‘వామపక్షవాదులు, ఎంఐఎం వంటి పార్టీలు లేవనెత్తిన అభ్యంతరాలు చాలా చిన్నవి. ఈ రకమైన నిరాధారమైన ఆరోపణలు మరియు అభ్యంతరాలపై ఎవరైనా స్పందించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి మతాన్ని ఆచరించే స్వేచ్ఛను అందిస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఆ హక్కుకు మినహాయింపు కాదు. భారత పౌరుడిగా తన సొంత మత హక్కులు మరియు ఆచారాలను నిర్వహించడానికి ఇతరులకన్నా ఆయనకే ఎక్కువ హక్కులు ఉన్నాయి. అభ్యంతరం వ్యక్తం చేస్తున్న కమ్యూనిస్ట్ నాయకులను పూజలో పాల్గొనడానికి ఆహ్వానిస్తున్నాను’ అని ఆయన అన్నారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆగస్టు 5న అయోధ్యలోని రాముడి ఆలయానికి పునాది రాయి వేయనున్నారు. ఇందులో అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర కేబినెట్ మంత్రులు, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తదితరులు పాల్గొనే అవకాశం ఉంది. రామ్ మందిర్ నిర్మాణం కోసం అయోధ్య వద్ద వివాదాస్పద స్థలాన్ని ఆలయ నిర్వాహకులకు అప్పగించాలని సుప్రీంకోర్టు గత ఏడాది నవంబర్ 9న కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

For More News..

వీడియో: ఊరికి రోడ్డు లేక.. నిండుచూలాలిని బుట్టలో మోసుకెళ్లిన కుటుంబసభ్యులు

రాష్ట్రంలో కొత్తగా 1891 కరోనా కేసులు

కరోనాను జయించిన 110 ఏళ్ల బామ్మ