అసని తుపాన్ ఎఫెక్ట్: ఏపీలో రేపటి ఇంటర్ ఎగ్జామ్ వాయిదా

అసని తుపాన్ ఎఫెక్ట్: ఏపీలో రేపటి ఇంటర్ ఎగ్జామ్ వాయిదా

అమరావతి: బంగాళాఖాతంలో ఏర్పడిన ‘అసని’ తుపాను ప్రభావం ఇంటర్మీడియట్ పరీక్షలపై పడింది. దిశ మార్చుకుంటూ పలు జిల్లాలపై విరుచుకుపడే అవకాశం ఉందన్న వాతావరణశాఖ హెచ్చరికలపై విద్యాశాఖ స్పందించింది. రేపు జరగాల్సిన ఇంటర్మీడియట్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. రేపు జరగాల్సిన పరీక్షను ఈనెల 25వ తేదీన జరుగుతుందని ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించింది.
12వ తేదీన పరీక్ష యధావిధిగా..అదే టైమింగ్స్ ప్రకారం
రేపు జరగాల్సిన పరీక్షను మాత్రమే వాయిదా వేయడం జరిగిందని.. ఎల్లుండి అంటే ఈనెల 12వ తేదీన జరగాల్సిన పరీక్ష యధావిధిగా.. ఇప్పటి వరకు జరిగిన వేళల్లోనే జరుగుతుందని ఇంటర్మీడియట్ బోర్డు స్పష్టం చేసింది. 
ఒడిశా వద్ద తీరం దాటే అవకాశం ఉందనుకున్న ‘అసని’ తుపాను దిశ మార్చుకుని మచిలీపట్నం వైపు దూసుకొస్తోంది. మరికొన్ని గంటల్లో లేదా రేపు బుధవారం సాయంత్రంలోపు తీరం దాటే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా. ఈ తుపాను ప్రభావంతో కోస్తాంధ్రతోపాటు రాయలసీమలోని కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు.. మరికొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా.

 

ఇవి కూడా చదవండి

‘జూ’లో ఎండవేడి.. జంతువుల కోసం ఏం చేస్తున్నారంటే..

అసైన్డ్ భూముల్ని దోచుకోవడంపైనే కేసీఆర్ ఫోకస్

టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగానే నారాయణ అరెస్టు