ఆశ, కావ్యకు డబుల్స్ టైటిల్.. పవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గ్రిడ్ ఇంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రీజినల్ బ్యాడ్మింటన్

ఆశ, కావ్యకు డబుల్స్ టైటిల్.. పవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గ్రిడ్ ఇంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రీజినల్ బ్యాడ్మింటన్

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: పవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గ్రిడ్ ఇంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రీజినల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌‌‌‌‌‌‌‌లో ఆశ, కావ్య విమెన్స్‌‌‌‌‌‌‌‌ డబుల్స్‌‌‌‌‌‌‌‌లో చాంపియన్లుగా నిలిచారు. శనివారం జరిగిన ఫైనల్లో సదరన్ రీజియన్–1 తరఫున బరిలోకి దిగిన ఆశ–కావ్య 13–15, 15–12, 15–13తో పింకి–సరిత (నార్నర్త్ రీజియన్‌‌‌‌‌‌‌‌1)పై విజయం సాధించారు. మెన్స్ డబుల్స్‌‌‌‌‌‌‌‌లో మనీష్‌‌‌‌‌‌‌‌–సాకేత్ (ఎన్‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌1) 21–11, 21–15తో అర్పిత్‌‌‌‌‌‌‌‌–హరి కిశోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (కార్పొరేట్ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌)పై గెలిచారు.

మెన్స్ సింగిల్స్‌‌‌‌‌‌‌‌లో పింటూ (ఎన్‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌1) 21–23, 21–17, 21–17తో హరి కిశోర్ (సీసీ)ని ఓడించి టైటిల్ నెగ్గగా, విమెన్స్ సింగిల్స్ ఫైనల్లో పింకి (ఎన్‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌1) విజేతగా నిలిచింది. మెన్స్ టీమ్ ఈవెంట్‌‌‌‌‌‌‌‌ నార్తర్న్ రీజియన్1, విమెన్స్‌‌‌‌‌‌‌‌ టీమ్ ఈవెంట్‌‌‌‌‌‌‌‌లో కార్పొరేట్ సెంటర్ జట్లు ట్రోఫీలు నెగ్గాయి.  పవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గ్రిడ్ సదరన్ రీజియన్‌‌‌‌‌‌‌‌–1 ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డోమన్ యాదవ్‌‌‌‌‌‌‌‌, చీఫ్ జనరల్ మేనేజర్లు  అరుణ్ కుమార్‌‌‌‌‌‌‌‌ వెంకట సాయి  విన్నర్లకు ట్రోఫీలు అందజేశారు.