ముసారాంబాగ్‌‌లో ఆశా వర్కర్ల నిరసన

ముసారాంబాగ్‌‌లో ఆశా వర్కర్ల నిరసన

హైదరాబాద్ ముసారాంబాగ్‌‌లో ఆశా వర్కర్లు నిరసనకు దిగారు. ఆశా వర్కర్ గా పని చేస్తున్న సుజాత మృతికి అధికారుల వేధింపులే కారణమంటూ వారు ఆందోళనకు దిగారు. విధుల్లో ఉండగానే ఆమె చనిపోవడం కలకలం రేపింది. ఈ విషయం తెలుసుకున్న ఆశా వర్కర్లు ఆమె పని చేస్తున్న ప్రాంతానికి చేరుకుని నిరసనకు దిగారు. సుజాత మృతదేహంతో రోడ్డుపై బైఠాయించారు. పోలీసులు రంగ ప్రవేశం చేయడంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తతంగా మారింది. 

మలక్ పేట్ పీఎస్ పరిధిలో శాలివాహన నగర్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ లో సుజాత ఆశా వర్కర్ గా పని చేస్తున్నారు. విధుల్లో ఉండగా.. సుజాత మృతి చెందింది. భారీ సంఖ్యలో ఆశా వర్కర్లు అక్కడకు చేరుకున్నారు. సుజాత మృతికి అధికారుల వేధింపులు, పని ఒత్తిడే కారణమని ఆరోపించారు. ముసారాంబాగ్ లో ఆశా వర్కర్స్ నిరసనకు దిగారు. సుజాత డెడ్ బాడీతో రోడ్డుపై బైఠాయించారు. మృతురాలి కుటుంబాన్ని ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని, ఆమె కుటుంబసభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. నిరసన చేస్తున్న ఆశా వర్కర్స్ ని పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు.