యాషెస్ సిరీస్ మూడో టెస్టు.. టాస్ గెలిచిన ఇంగ్లండ్.. ఆసీస్ బ్యాటింగ్

యాషెస్ సిరీస్ మూడో టెస్టు.. టాస్ గెలిచిన ఇంగ్లండ్.. ఆసీస్ బ్యాటింగ్

యాషెస్ సిరీస్ లో భాగంగా హెడింగ్లీలో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడో టెస్టు ప్రారంభంమైంది.  ఈ మ్యాచ్ లో ఇంగ్లండ్ టీమ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకుంది.  

దీంతో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఆసీస్ కు ఇంగ్లండ్ షాకిచ్చింది.  ఆ జట్టు ఓపెనర్ డెవిడ్ వార్నర్ (4) పరుగులకే వెనుదిరిగాడు. బ్రాడ్ బౌలింగ్ లో క్రాలీకి క్యాచ్  ఇచ్చి ఔటయ్యాడు.  

ప్రస్తుతం క్రీజ్లో ఖవాజా (6), లబుషేన్ (12) పరుగులతో ఉన్నారు. ఆసీస్  ఆరు ఓవర్లకు ఒక వికెట్ కోల్పోయి 27 పరుగులు చేసింది. కాగా ఇప్పటికే మొదటి రెండు టెస్టు మ్యాచ్ లు గెలిచి సిరీస్ లో ముందుంది ఆసీస్. 

ఆస్ట్రేలియా  :  డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లాబుషాగ్నే, స్టీవెన్ స్మిత్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ కారీ(w), పాట్ కమిన్స్(c), మిచెల్ స్టార్క్, టాడ్ మర్ఫీ, స్కాట్ బోలాండ్
ఇంగ్లండ్  :  జాక్ క్రాలీ, బెన్ డకెట్, హ్యారీ బ్రూక్, జో రూట్, జానీ బెయిర్‌స్టో(w), బెన్ స్టోక్స్(c), మోయిన్ అలీ, క్రిస్ వోక్స్, మార్క్ వుడ్, ఆలీ రాబిన్సన్, స్టువర్ట్ బ్రాడ్