బ్రిస్బేన్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న యాషెస్ రెండో టెస్ట్ (డేనైట్)లో ఇంగ్లండ్ బ్యాటింగ్‌లో తడబడింది. ఆసీస్ బౌలర్లు స్టార్క్ (2/48), మైకేల్ నాసర్ (2/27), స్కాట్ బోలాండ్ (2/33) ధాటికి ఇంగ్లిష్ లైనప్ పెవిలియన్‌కు క్యూ కట్టింది. ఫలితంగా శనివారం మూడో రోజు ఆట ముగిసే టైమ్‌కు ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 35 ఓవర్లలో 134/6 స్కోరు చేసింది.
బెన్ స్టోక్స్ (4 బ్యాటింగ్), విల్ జాక్స్ (4 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. జాక్ క్రాలీ (44) ఫర్వాలేదనిపించినా బెన్ డకెట్ (15), ఒలీ పోప్ (26), జో రూట్ (15), హ్యారీ బ్రూక్ (15, జెమీ స్మిత్ (4) నిరాశపర్చారు. అంతకుముందు 378/6 ఓవర్‌నైట్ స్కోరుతో ఆట కొనసాగించిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 117.3 ఓవర్లలో 511 రన్స్‌కు ఆలౌటైంది.
దాంతో కంగారూలకు177 రన్స్ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. అలెక్స్ క్యారీ (63), స్టార్క్ (77) దంచికొట్టారు. కార్సీ 4, స్టోక్స్ 3 వికెట్లు తీశారు.
