బ్యాక్ టు బ్యాక్ క్రేజీ ఆఫర్స్‌తో టాలీవుడ్‌లో దూసుకెళుతోంది ఆషికా రంగనాథ్. రీసెంట్‌గా రవితేజకు జోడీగా ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో అలరించిన ఆమె తాజాగా మరో అవకాశాన్ని అందిపుచ్చుకుంది. శర్వానంద్ హీరోగా శ్రీనువైట్ల రూపొందించనున్న చిత్రంలో ఆషికను హీరోయిన్‌గా సెలెక్ట్ చేశారనే టాక్ వినిపిస్తోంది. తనదైన గ్లామర్‌తో ఆకట్టుకునే ఆమె ఈ చిత్రంలో పెర్ఫార్మెన్స్‌కు స్కోప్ ఉన్న పాత్ర పోషించబోతోందట.
ఇప్పటికే లుక్ టెస్ట్ పూర్తవగా మార్చి నుంచి రెగ్యులర్ షూటింగ్‌ను స్టార్ట్ చేయబో తున్నట్టు తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించనున్న ఈ చిత్రంలో మరో సీనియర్ హీరో కీలక పాత్రలో కనిపించనున్నారని తెలుస్తోంది. మరోవైపు ఆషిక రంగనాథ్ ‘విశ్వంభర’లో నటించగా, ఓ కన్నడ సినిమాను కూడా కంప్లీట్ చేసింది. ప్రస్తుతం తమిళంలో ‘సర్దార్2’ చిత్రంలో కార్తికి జంటగా నటిస్తోంది.
