రెండో పెళ్లిపై స్పందించిన ఆశిష్ విద్యార్థి.. కారణం ఏంటంటే?

రెండో పెళ్లిపై స్పందించిన ఆశిష్ విద్యార్థి.. కారణం ఏంటంటే?

ప్రముఖ నటుడు ఆశిష్ విద్యార్థి రీసెంట్ గా రెండో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే తన వయసులో సగం వయసున్న అమ్మాయిని ఆశిష్ విద్యార్థి పెళ్లిచేసుకోవడంపై నెటిజన్న్ నుండి నెగిటీవ్ రెస్పాన్స్ వచ్చింది. మరికొందరైతే బహిరంగంగానే సిగ్గుండాలి అంటూ విమర్శించారు. ఈ విమర్శలు తీవ్ర స్థాయికి వెళ్లడంతో వాటిపై తాజాగా స్పందించాడు ఆశిష్ విద్యార్థి. ఈ మేరకు ఇంస్టాగ్రామ్ లో ఒక వీడియో బైట్ ను కూడా పెట్టాడు.

“మనలో ప్రతి ఒక్కరూ వివిధ సామాజిక వర్గాల నుండి వచ్చినా, భిన్నమైన నమ్మకాలు, మతాలు ఉన్నా.. మనమందరం సంతోషంగా ఉండాలనుకుంటున్నాము. 22 ఏళ్ల క్రితం, నాకు పెళ్లయింది. కొంత కాలంగా మా ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. ఇద్దరి దారులు వేరని భావించాం. వాటిని విస్మరించి కలిసి ఉండాలి అనుకున్నాం. కానీ కుదరలేదు. స్నేహపూర్వకంగానే విడిపోయాం. 

అయితే విడాకుల తర్వాత మళ్లీ పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను. ఆ సమయంలోనే రూపాలి బారువాను కలిశాను. భార్యాభర్తలుగా జీవితాన్ని కొనసాగించాలి అనుకున్నాం. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. ఇప్పుడు ఒక్కటయ్యాం” అని వివరించారు". ప్రస్తుతం ఆశిష్ విద్యార్థి షేర్ చేసిన ఈ వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.