రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా వెటరన్ పేసర్

రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా వెటరన్ పేసర్

కోల్‌‌కతా: టీమిండియా వెటరన్ పేస్ బౌలర్ అశోక్ దిండా రిటైర్మెంట్ ప్రకటించాడు. క్రికెట్‌‌లోని అన్ని ఫార్మాట్ల నుంచి సన్యాసం తీసుకుంటున్నట్లు దిండా తెలిపాడు. ఇంటర్నేషనల్ క్రికెట్‌‌ ఎక్కువగా ఆడనప్పటికీ ఫస్ట్ క్లాస్ క్రికెట్‌‌లో దిండా మంచి బౌలర్‌‌గా పేరు తెచ్చుకున్నాడు. 15 ఏళ్ల కెరీర్‌‌లో 116 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌‌లు ఆడిన అతడు 420 వికెట్లు సాధించాడు. టీమిండియాకు 13 మ్యాచ్‌‌ల్లో ప్రాతినిధ్యం వహించిన దిండా.. 12 వికెట్లు తీశాడు. భారత్ తరఫున 9 టీ20ల్లో ఆడిన ఈ స్పీడ్‌‌స్టర్ 17 వికెట్లు తీశాడు.

రీసెంట్‌‌గా ముగిసిన సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో దిండా గోవా తరఫున మూడు మ్యాచులు ఆడాడు. అయితే మోకాలి నొప్పితో చివరి రెండు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. ఈ నొప్పి వల్ల పరిగెత్తలేకపోతున్నానని, తన శరీరం కూడా సహకరించడం లేదని అందుకే రిటైర్మెంట్ నిర్ణయం తీసుకున్నానని మాజీ పేసర్ చెప్పాడు. రిటైర్మెంట్‌‌కు సంబంధించి సమాచారాన్ని ఈ-మెయిల్స్ ద్వారా బీసీసీఐ, జీసీఐకి పంపానన్నాడు.