- స్టాక్ మార్కెట్లో లాభాలొస్తాయని
- రూ.39 లక్షలు ఇచ్చిన మరొకరు
ఎల్బీనగర్, వెలుగు: సైబర్ నేరగాళ్లను పట్టుకునే సైబర్‌క్రైమ్స్ లో పని చేసే ఇద్దరు ఇన్స్పెక్టర్లు చివరకు వారి చేతిలో మోసపోయారు. సైబర్క్రిమినల్స్ నేరాల పట్ల అవగాహన ఉన్న వారే రూ.లక్షలు పోగొట్టుకోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.
టీటీడీ దర్శనం పేరుతో ఓ ఇన్స్పెక్టర్ ఈ రూ.4 లక్షలు పోగొట్టుకోగా, స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెడితే లాభాలు వస్తాయని నమ్మిన మరొకరు ఏకంగా రూ.39లక్షలు సమర్పించుకున్నారు. ఈ ఇద్దరూ సైబర్ క్రైమ్ పోర్టల్ లో ఫిర్యాదు చేసినట్టు సమాచారం. ఈ విషయమై రాచకొండ సైబర్ క్రైమ్ డీసీపీ, ఏసీపీ వివరణ కోరేందుకు ప్రయత్నించగా స్పందించలేదు.
