- కలెక్టర్ పమేలా సత్పతి
కరీంనగర్ టౌన్, వెలుగు: జిల్లాకు సరిపడా యూరియా నిల్వలు ఉన్నాయని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ పమేలా సత్పతి సోమవారం తెలిపారు. ఇప్పటివరకు జిల్లాకు 22,368 మెట్రిక్ టన్నుల యూరియా సప్లై అయిందని, ప్రస్తుతం 4,246 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉందన్నారు.
రైతులకు ఇబ్బంది లేకుండా ప్రతి సేల్ కౌంటర్ వద్ద షామియానా, తాగునీటి సౌకర్యం కల్పించాలని అధికారులను ఆదేశించారు. యూరియా సరఫరాలో రైతులకు ఇబ్బందులు కలిగితే వ్యవసాయ అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు.
