Ashu Reddy: నా ఎమర్జెన్సీ కాంటాక్ట్ ఇక లేడు.. హీరో మృతిపై అషు రెడ్డి ఎమోషనల్ పోస్ట్

Ashu Reddy: నా ఎమర్జెన్సీ కాంటాక్ట్ ఇక లేడు.. హీరో మృతిపై అషు రెడ్డి ఎమోషనల్ పోస్ట్

టాలీవుడ్ నటి అషు రెడ్డి చేసిన ఓ ఎమోషనల్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తన బెస్ట్ ఫ్రెండ్, నటుడు భరత్ కాంత్ మరణ వార్తను పంచుకుంటూ ఆమె భావోద్వేగానికి గురైంది. భరత్‌తో కలిసి దిగిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ, “నువ్వు లేని లోటు ఎప్పటికీ తీరదు.. నా గుండెల్లో ఎప్పటికీ జీవిస్తూనే ఉంటావ్” అంటూ ఎమోషనల్ పదాలను రాసుకొచ్చింది.

అషు రెడ్డి తన పోస్టులో, “ఇది నాకు తీరని లోటు.. నా ప్రాణ స్నేహితుడు, నా ఎమర్జెన్సీ కాంటాక్ట్, నా కుటుంబ సభ్యుడు, నా ఆత్మీయుడు.. ఇప్పుడు శివయ్య చెంతకు చేరిపోయాడు. నీకు ఎప్పటికీ చేరని ఒక సందేశాన్ని ఇలా పోస్ట్ చేయాల్సి వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. నిన్ను మళ్లీ కలిసే వరకు నీ చిరునవ్వు, నీ ముఖం ఎప్పటికీ నా జ్ఞాపకాలలో నిలిచిపోతాయి. భరత్ కాంత్.. నువ్వు నాకు ఎంతో ప్రత్యేకమైన వ్యక్తివి. బరువైన హృదయంతో నీకు వీడ్కోలు చెబుతున్నాను. మిస్ యూ భరత్” అని అషురెడ్డి పోస్ట్ చేసింది. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Ashu Reddy❤️ (@ashu_uuu)

భరత్ కాంత్ షార్ట్ ఫిల్మ్స్ ద్వారా గుర్తింపు తెచ్చుకుని, 2024లో విడుదలైన ‘టెనెంట్‌’ సినిమాలో హీరోగా నటించాడు. అలాగే మరికొన్ని చిత్రాల్లో చిన్న పాత్రల్లో కనిపించాడు. మరోవైపు గూడ సాయిత్రిలోక్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తూ గుర్తింపు పొందాడు.

ఎలా చనిపోయారంటే.. 

నెల్లూరుకు చెందిన నటుడు కత్తి భరత్ కాంత్ (31), సినిమాటోగ్రాఫర్ గూడ సాయిత్రిలోక్ (31) రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. మే 11, 2026 తెల్లవారుజామున నెల్లూరు నుంచి హైదరాబాద్‌కు వస్తుండగా, ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని బొంగుళూరు – తుక్కుగూడ మార్గంలోని ఎగ్జిట్-12 సమీపంలో వీరు ప్రయాణిస్తున్న కారు ముందువెళ్తున్న కంటైనర్ లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భరత్ కాంత్, సాయిత్రిలోక్ ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.