హాట్ లుక్లో అషురెడ్డి..ఎలా ఉంది ఎల్లో!

హాట్ లుక్లో అషురెడ్డి..ఎలా ఉంది ఎల్లో!

జూనియర్ సమంతగా పేరు తెచ్చుకున్న నటి అషు రెడ్డి (Ashu Reddy). ఈ అమ్మడు చాలా తక్కువ సమయంలోనే బుల్లితెరపై సందడి చేసింది. బిగ్‌ బాస్ లో ఈ బ్యూటీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలైంది.  బిగ్ బాస్ తర్వాత సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌ అయిన ముద్దుగుమ్మ అషు రెడ్డి సినిమాల్లో కూడా వరుసగా నటిస్తూ వచ్చింది.

అయితే వచ్చిన ప్రతి ఒక్క ఆఫర్‌ కీ ఓకే చెప్పకుండా స్లోగానే సినిమాలు చేస్తోంది. సోషల్ మీడియాలో రెగ్యులర్ గా అందాల ఆరబోత ఫొటోలు షేర్ చేసే అషు రెడ్డి మరోసారి తన అందమైన ఫోటోలను షేర్‌ చేసింది. అందమైన అషు రెడ్డి ఈసారి ఎల్లో డ్రెస్లో మరింత అందంగా కనిపిస్తూ నెటిజెన్లతో వాహ్ అనిపించుకుంటోంది.

అషు రెడ్డి ఇంత అందంగా ఉన్నా కూడా, తెలుగు అమ్మాయి అవ్వడం వల్ల సినిమాల్లో హీరోయిన్ గా ఆఫర్లు పెద్దగా రావడం లేదనే వాదన కూడా ఉంది. ఇతర భాషల్లో అషు రెడ్డి ప్రయత్నిస్తే తప్పకుండా ఆఫర్లు చాలానే వస్తాయనే అభిప్రాయం కూడా మరోవైపు ఉంది. అషు ఆ దిశగా ఏమైనా ప్రయత్నాలు చేస్తుందా చూడాలి. 

రామ్ గోపాల్ వర్మ ఇంటర్వ్యూస్‌తో పాటు బిగ్‌బాస్‌‌ కంటెస్టెంట్‌‌గా పాపులర్‌‌‌‌ అయిన అషూ రెడ్డి..టిక్ టాక్ కంటే ముందు వచ్చిన డబ్ స్మాష్తో తెగ పాపులారిటీ సంపాదించుకున్న విషయం తెలిసిందే.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Ashu Reddy (@ashu_uuu)