కరోనా విరుగుడుకు అశ్వగంధ!

కరోనా విరుగుడుకు అశ్వగంధ!
  • ఢిల్లీ ఐఐటీ, జపాన్ సైంటిస్టుల స్టడీలో ఆసక్తికర అంశాలు వెల్లడి

న్యూఢిల్లీ : కరోనా విరుగుడుకు అవసరమైన ఔషధ లక్షణాలు ఆయుర్వేద మందు అయిన అశ్వగంధలో ఉన్నయంట. ఢిల్లీ ఐఐటీ, జపాన్ నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ ఇండస్ట్రీయల్ సైన్స్ అండ్ టెక్నాలజీ (ఎఐఎస్టీ) సైంటిస్టులు కనుగొన్నారు. వైరస్ వ్యాప్తిలో కీలకమైన ప్రొటీన్ లను విడదీసేందుకు ఉపయోగపడే ఎస్ 2 ఎంజైమ్ లు లక్ష్యంగా ఈ స్టడీ చేశారు. ఇందులో అశ్వగంధ పుప్పొడిలో కరోనాను నివారించే గుణాలున్నట్లు గుర్తించామని ఈ స్టడీకి నేతృత్వం వహిస్తున్న ప్రొఫెసర్ డి. సుందర్ తెలిపారు. ఈ ఫలితాలను జర్నల్ ఆఫ్ బయోమాలిక్యూర్ స్ట్రక్చర్ అండ్ డైనమిక్స్ లోనూ ప్రచురించేందుకు అనుమతులు వచ్చినట్లు చెప్పారు. అశ్వగంధ పుప్పొడి కరోనాకు మందుగా పనిచేసే అవకాశం ఉందని రీసెర్చ్ టీమ్ గుర్తించింది. అశ్వగంధకు రోగనిరోధక శక్తి పెంచే ఔషధంగ పేరుంది. దీంతో కొన్ని రోజులుగా కరోనా జన్యు నిర్మాణంపై అశ్వగంధ పుప్పొడిని పై ప్రయోగాలు చేస్తున్నారు. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ కోసం ప్రయోగాలు జరుగుతుండగా..ఆయుర్వేదంలోనూ దీనికి మందు కనుగొనేందుకు ఆయూష్ ఇటీవల ఐదు ఆయుర్వేద మందులపై పరిశోధనలు మొదలుపెట్టింది. ఇందులో అశ్వగంధ కూడా ఉంది. తాజా రీసెర్చ్ లో అశ్వగంధ కు కరోనా పై పోరాడే శక్తి ఉందని గుర్తించటం పాజిటివ్ సంకేతామని సైంటిస్టులు చెబుతున్నారు.