
హైదరాబాద్: పోలీస్ స్టేషన్ ముందు ఓ ఏఎస్ఐ ఆత్మహత్య యత్నానికి పాల్పడిన నగరంలో కలకలం రేపింది. బాలాపూర్ పోలీస్ స్టేషన్ లో ఏఎస్ఐ గా విధులు నిర్వహించిన నరసింహులు అనే ఉద్యోగి శుక్రవారం మధ్యాహ్నం అదే పోలీస్ స్టేషన్ ముందు పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. వెంటనే గమనించిన అక్కడి ఉద్యోగులు మంటలార్పి అతడిని దగ్గరలో ఉన్న అపోలో drdo హాస్పిటల్ కి తరలించారు. ఇటీవలే బాలాపూర్ నుంచి మంచాల పోలీస్ స్టేషన్ కు ASI గా బదిలీ అయిన నరసింహులు ఇలా ఆత్మహత్యకు ప్రయత్నించడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ విషయంపై మంచాల సిఐ అనుదీప్ మాట్లాడుతూ.. నరసింహులు గురువారం మంచాల పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ చేశాడని, శుక్రవారం విధులకు హాజరు కావాల్సి ఉండగా.. పీఎస్ కు రాలేదని అన్నారు. ఈ ప్రమాదంలో నరసింహులు చేయి, తొడ, కడుపు భాగాల్లో స్వల్ప గాయాలయ్యాయి.