బందోబస్త్ కు వచ్చి.. గుండెపోటుతో మృతి చెందిన ఏఎస్ఐ

V6 Velugu Posted on Sep 20, 2021

నారాయణపేట, వెలుగు: గణేష్ నిమజ్జనం బందోబస్తుకు వచ్చిన ఓ ఏఎస్ఐ గుండెపోటుతో మృతి చెందాడు. నిజామాబాద్ జిల్లాలో ఏఆర్‌‌‌‌ ఏఎస్ఐగా పని చేస్తున్న శంకరయ్య(55)కు గణేశ్ నిమజ్జనం సందర్భంగా బందోబస్త్ కోసం నారాయణపేటలో డ్యూటీ వేశారు. జిల్లా కేంద్రానికి వచ్చిన ఆయన శనివారం రాత్రి ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌‌లో రెస్ట్‌‌ తీసుకున్నారు. ఆదివారం బందోబస్తుకు వెళ్లాల్సి ఉండడంతో శంకరయ్యను తీసుకెళ్లేందుకు తోటి సిబ్బంది వెళ్లారు. కానీ, అప్పటికే ఆయన మృతి చెందాడు. వెంటనే డాక్టర్లకు సమాచారం ఇవ్వగా.. వారు వచ్చి టెస్టులు చేశారు. శంకరయ్యకు తెల్లవారు జామున గుండెపోటు రావడంతో చనిపోయినట్లు కన్ఫామ్ చేశారు. ఆయన డెడ్‌‌బాడీని నిజామాబాద్ కు తరలించారు. 
 

Tagged heart attack, Nizamabad, ASI Sankarayya died , ganesh immersion security

Latest Videos

Subscribe Now

More News