
- ఆదివారం ఇండియాతో సూపర్‑4 మ్యాచ్
- నేడు శ్రీలంకతో అఫ్గాన్ ఢీ
దుబాయ్: సూపర్–4కు చేరాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో పాకిస్తాన్ జోరు చూపెట్టింది. మహ్మద్ రిజ్వాన్ (57 బాల్స్‌లో 6 ఫోర్లు, 1 సిక్స్‌తో 78 నాటౌట్), ఫకర్ జమాన్ (41 బాల్స్‌లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 53) హాఫ్ సెంచరీలతో దంచికొట్టడంతో.. శుక్రవారం జరిగిన గ్రూప్–ఎ లీగ్ మ్యాచ్‌లో పాక్ 155 రన్స్ తేడాతో హాంకాంగ్‌పై గెలిచింది. రన్స్ పరంగా ఈ ఫార్మాట్లో పాక్‌కు ఇదే హయ్యెస్ట్ వికర్టీ కావడం విశేషం. ఈ గెలుపుతో రెండు పాయింట్లతో గ్రూప్–ఎ నుంచి సూపర్–4కు క్వాలిఫై అయ్యింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పాక్ 20 ఓవర్లలో 193/2 స్కోరు చేసింది.
కెప్టెన్ బాబర్ ఆజమ్ (9) మరోసారి నిరాశపర్చినా, రిజ్వాన్, జమాన్.. హాంకాంగ్ బౌలింగ్‌ను ఉతికి ఆరేశారు. రెండో వికెట్‌కు 116 రన్స్ జోడించిన తర్వాత 17వ ఓవర్లో జమాన్ ఔటైనా, చివర్లో కుష్దిల్ షా (15 బాల్స్‌లో 5 సిక్సర్లతో 35 నాటౌట్) చెలరేగిపోయాడు. ఆఖరి ఓవర్లోనే నాలుగు సిక్సర్లు కొట్టడంతో 29 రన్స్ వచ్చాయి. ఛేజింగ్‌లో హాంకాంగ్ 10.4 ఓవర్లలో 38 రన్స్‌కే కుప్పకూలింది. నిజాఖత్ (8) టాప్ స్కోరర్. షాదాబ్ ఖాన్ (4/8), నవాజ్(3/5)స్పిన్ దెబ్బకు హాంకాంగ్ టీ20ల్లో తమ లోయెస్ట్ స్కోరు నమోదు చేసింది. ఇన్నింగ్స్‌లో ఒక్కరు కూడా డబుల్ డిజిట్ స్కోరు చేయలేకపోయారు. రిజ్వాన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఆదివారం జరిగే సూపర్4 పోరులో ఇండియాతో పాక్ తలపడుతుంది.