శభాష్ హైదరాబాదీ..!: మ్యాచ్‌తో పాటు మనసులూ గెలిచిన సిరాజ్

శభాష్ హైదరాబాదీ..!: మ్యాచ్‌తో పాటు మనసులూ గెలిచిన సిరాజ్

ఆసియా క‌ప్ ఫైన‌ల్లో భార‌త పేసర్ మ‌హ్మ‌ద్ సిరాజ్ నిప్పులు చెరిగిన విషయం తెలిసిందే. ఈ స్పీడ్‌స్ట‌ర్ వేసిన బుల్లెట్ లాంటి బంతులను ఎదుర్కోలేక లంక బ్యాటర్లు లబోదిబోమన్నారు. నేను.. నేను.. అంటూ ఒకరివెంట మరొకరు పెవిలియన్ చేరారు. ఈ మ్యాచ్‌లో 6 వికెట్ల‌తో విజృంభించి లంక పతనాన్ని శాసించిన సిరాజ్‌కు ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్‌ దక్కగా.. దానిని అతను మైదాన సిబ్బందికి ఇస్తున్నట్లు ప్రకటించి అందరి మనసులు గెలిచాడు.  

‘ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్‌' ప్రైజ్‌మ‌నీగా సిరాజ్‌కు 5వేల అమెరికన్ డాల‌ర్లు అందాయి. అంటే భార‌తీయ క‌రెన్సీలో రూ. 4 లక్ష‌లు. ఆ  మొత్తాన్ని ప్రేమ‌దాస స్టేడియం సిబ్బందికి ఇస్తున్న‌ట్టు అతను ప్రకటించాడు. "ఈ  టోర్నీలో గ్రౌండ్ మెన్ చాలా నిబద్దతతో పనిచేశారు. వారి కష్టం లేకుంటే ఈ టోర్నీయే సాధ్యం కాక‌పోయేది. ఆ క‌ష్టానికి గుర్తుగా నా ప్రైజ్‌మ‌నీని వారికి ఇస్తున్నా.." అని సిరాజ్ తెలిపాడు. అతను తీసుకున్న ఈ నిర్ణయంతో స్టేడియం మొత్తం ఒక్క‌సారిగా చ‌ప్ప‌ట్లతో మార్మోగిపోయింది.

కాగా, ఆసియా క్రికెట్ కౌన్సిల్(ఏసీసీ) మరియు శ్రీలంక క్రికెట్ (ఎస్ఎల్‌సీ).. కొలంబో మరియు క్యాండీలో పనిచేసే క్యూరేటర్లు, గ్రౌండ్స్‌మెన్లకు రూ.40 ల‌క్ష‌లు ఇస్తున్న‌ట్టు ప్ర‌క‌టించాయి.