ఇవాల్టి నుంచి ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌‌‌‌షిప్

ఇవాల్టి నుంచి ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌‌‌‌షిప్
  • ఇండియా షట్లర్లకు ఆసియా సవాల్
     

నింగ్బో (చైనా): డబుల్ ఒలింపిక్ మెడలిస్ట్ పీవీ సింధు సహా ఇండియా షట్లర్లంతా కఠిన సవాల్‌‌‌‌కు రెడీ అయ్యాడు. మంగళవారం మొదలయ్యే ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌‌‌‌షిప్స్‌‌‌‌లో పోటీపడనున్నారు. ఒలింపిక్స్‌‌‌‌కు ఇదే చివరి మేజర్ ఈవెంట్ కావడంతో ఈ టోర్నీలో పోటీ  హోరాహోరీగా సాగే అవకాశం ఉంది. వరల్డ్ నంబర్ వన్‌‌‌‌ డబుల్స్‌‌‌‌ ప్లేయర్లు సాత్విక్–చిరాగ్ చివరి నిమిషంలో టోర్నీ నుంచి విత్‌‌‌‌డ్రా అవ్వడంతో సింగిల్స్‌‌‌‌ ప్లేయర్లపైనే ఇండియా పతక ఆశలు పెట్టుకుంది. 

విమెన్స్‌‌‌‌ సింగిల్స్ తొలి రౌండ్‌‌‌‌లో సింధు 33వ ర్యాంకర్‌‌‌‌‌‌‌‌ గొహ్ జిన్ వీ (మలేసియా)తో పోటీ పడనుంది. మెన్స్‌‌‌‌ సింగిల్స్‌‌‌‌లో లక్ష్యసేన్‌‌‌‌కు తొలి రౌండ్‌‌‌‌లోనే టాప్ సీడ్ షి యుకీ (చైనా)తో సవాల్ ఎదురవనుంది. ప్రియాన్షు ఎనిమిదో సీడ్ లీ జి జియా (మలేసియా)తో  తలపడనుండగా.. ఏడో సీడ్ హెచ్‌‌‌‌ఎస్‌‌‌‌ ప్రణయ్ చైనాకు చెందిన లు గ్వాంగ్ జుతో, శ్రీకాంత్.. కంటా సునెయమ (జపాన్‌)తో పోరు ఆరంభించనున్నారు. డబుల్స్‌‌‌‌లో అర్జున్–ధ్రువ్, కృష్ణప్రసాద్–సాయి ప్రతీక్‌‌‌‌, విమెన్స్‌‌‌‌లో అశ్విని పొన్నప్ప–తనీషా, పుల్లెల గాయత్రి–ట్రీసా జాలీ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.