అమ్మాయిల జట్టుకు కఠిన సవాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. ఇవాళ్టి (ఫిబ్రవరి 3) నుంచి ఆసియా బ్యాడ్మింటన్ టీమ్ చాంపియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

అమ్మాయిల జట్టుకు కఠిన సవాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. ఇవాళ్టి (ఫిబ్రవరి 3) నుంచి ఆసియా బ్యాడ్మింటన్ టీమ్ చాంపియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

కింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డావో (చైనా): ఇండియా షట్లర్లు ప్రతిష్టాత్మక ఆసియా బ్యాడ్మింటన్ టీమ్ చాంపియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రెడీ అయ్యారు. మంగళవారం మొదలయ్యే ఈ మెగా టోర్నీలో ఇండియా విమెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు కఠిన పరీక్ష ఎదురుకానుంది. డిఫెండింగ్ చాంపియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా బరిలోకి దిగుతున్న అమ్మాయిల జట్టు గాయం కారణంగా స్టార్ ప్లేయర్ పీవీ సింధు సేవలు కోల్పోయింది. సింధు లేని లోటును భర్తీ చేసే బాధ్యత 17 ఏండ్ల యంగ్ షట్లర్ తన్వీ శర్మపై పడింది. 

ఇటీవల వరల్డ్ జూనియర్ చాంపియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సిల్వర్ మెడల్ గెలిచి ఫామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్న తన్వీతో పాటు ఉన్నతి హుడా, మాళవిక బన్సోద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు సింగిల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సత్తా చాటాల్సి ఉంది. డబుల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పుల్లెల గాయత్రి–-ట్రీసా జాలీ జోడీ జట్టును ముందుండి నడిపించనుంది. గ్రూప్-–వైలో ఉన్న అమ్మాయిల టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. బుధవారం మయన్మార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో తలపడనుంది. మరోవైపు సీనియర్లతో కూడిన మెన్స్ టీమ్ పతకమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది.

లక్ష్యసేన్, హెచ్.ఎస్. ప్రణయ్, కిడాంబి శ్రీకాంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లతో కూడిన సింగిల్స్ విభాగం చాలా బలంగా కనిపిస్తోంది. ఇక డబుల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టార్స్ సాత్విక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సాయిరాజ్– - చిరాగ్ శెట్టి మళ్లీ ఫామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి వచ్చి పతకం సాధించాలని పట్టుదలతో ఉన్నారు. గ్రూప్-–సిలో ఉన్న మెన్స్ టీమ్ సింగపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో తమ తొలి మ్యాచ్ ఆడనుంది. ఆ తర్వాత జపాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో జరిగే పోరు ఇండియాకు కీలకం కానుంది.