ఆసియా షూటింగ్ చాంపియన్ షిప్ లో మనుకు కాంస్యం.. రష్మికకు స్వర్ణం

ఆసియా షూటింగ్ చాంపియన్ షిప్ లో మనుకు కాంస్యం.. రష్మికకు స్వర్ణం

షిమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కెంట్: ఆసియా షూటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చాంపియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇండియా షూటర్లు సత్తా చాటుతున్నారు. డబుల్ ఒలింపిక్ మెడలిస్ట్, స్టార్ షూటర్ మను భాకర్ విమెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కాంస్యం సాధించగా, రష్మిక సహగల్ జూనియర్ విమెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎయిర్ పిస్టల్ పోటీలో బంగారు పతకాన్ని గెలుచుకుని చాంపియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నిలిచింది. మంగళవారం జరిగిన విమెన్స్ 10మీ.

 ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పిస్టల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫైనల్లో మను 219.7 పాయింట్లు సాధించి మూడో స్థానంలో నిలిచింది. చైనా షూటర్  ఖియాన్కే మా (243.2)స్వర్ణం,  కొరియాకు చెందిన జియిన్ యాంగ్ (241.6) రజతం నెగ్గారు. టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఈవెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మను భాకర్ (583), ఆసియా గేమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చాంపియన్ పాలక్ (573), సురూచి సింగ్ (574) కాంస్యం అందుకున్నారు. 10 మీ. ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పిస్టల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జూనియర్ కేటగిరీలో రష్మిక సహగల్ 241.9 పాయింట్లతో టాప్ ప్లేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో గోల్డ్ నెగ్గింది. ఆపై టీమ్ ఈవెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  వంశిక చౌదరి (573), మోహిని సింగ్ (565)తో రష్మిక (582)  ఇండియాకు మరో స్వర్ణం అందించింది.