రిఫా (బహ్రెయిన్): ఇండియా అథ్లెట్ పలాష్ మండల్.. ఆసియా యూత్ గేమ్స్‌లో బ్రాంజ్ మెడల్ సాధించాడు. శుక్రవారం (అక్టోబర్ 24) జరిగిన బాయ్స్ 5 వేల మీటర్ల వాక్‌లో మండల్ 24:48.92 సెకన్లలో లక్ష్యాన్ని చేరి మూడో ప్లేస్‌లో నిలిచాడు. చైనీస్ ద్వయం హవోజి జాంగ్ (21:43.82 సెకన్లు), యూజీ లు (22:28.64 సెకన్లు) వరుసగా గోల్డ్, సిల్వర్ నెగ్గారు.
అయితే ఇండియాకు చెందిన నితిన్ గుప్తా (19:24.48 సెకన్లు) పాట్నాలో నెలకొల్పిన మీట్ రికార్డును ఎవరూ బ్రేక్ చేయలేకపోయారు. ఓవరాల్‌గా ఇండియా రెండు స్వర్ణాలు, మూడు రజతాలు, ఏడు కాంస్యాలతో కొనసాగుతోంది.
