ఆసిఫాబాద్ కలెక్టర్​గా స్నేహ శబరీశ్

ఆసిఫాబాద్ కలెక్టర్​గా స్నేహ శబరీశ్

ఆసిఫాబాద్, వెలుగు : కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ హేమంత్ బోర్కడే బదిలీ అయ్యారు. ఆయనను జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ గా బాధ్యతలు అప్పగించారు. కొత్త కలెక్టర్​గా స్నేహ శబరీశ్ నియమితులయ్యారు. 2017 బ్యాచ్​కు చెందిన ఆమె ప్రస్తుతం జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్​గా పని చేస్తున్నారు. ఈ మేరకు చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.

ఆదిలాబాద్ కలెక్టర్​గా రాజర్షి షా

ఆదిలాబాద్ టౌన్ : ఆదిలాబాద్ జిల్లా నూతన కలెక్టర్​గా మెదక్ కలెక్టర్ రాజర్షి షాను నియమిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు ఇక్కడ కలెక్టర్​గా విధులు నిర్వహించిన  రాహుల్ రాజ్​ను మెదక్ జిల్లాకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువరించింది.