- జిల్లా ఎన్నికల అధికారి వెంకటేశ్ ధోత్రే
ఆసిఫాబాద్, వెలుగు : పంచాయతీ ఎన్నికల నిర్వహణలో స్టేజ్ 2 ఆర్ వోల పాత్ర కీలకమని ఆసిఫాబాద్జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అన్నారు. సోమవారం కలెక్టరేట్ లో అడిషనల్ కలెక్టర్ డేవిడ్, ఆర్డీవో లోకేశ్వర్ రావు, డీపీవో బిక్షపతితో కలిసి మొదటి, రెండో విడత సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నిక నిర్వహణలో భాగంగా స్టేజ్ 2 రిటర్నింగ్ అధికారులకు ఏర్పాటు చేసిన శిక్షణా కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎన్నికల నిర్వహణ, ఓట్ల లెక్కింపు, ఉప సర్పంచ్ ఎన్నిక ప్రక్రియను ప్రశాంతంగా నిర్వహించాలని సూచించారు.
ఎన్నికలను పూర్తి పారదర్శకంగా నిర్వహించాలని, పొరపాట్లకు, వివాదాలకు తావు లేకుండా ప్రశాంత వాతావరణంలో జరిగేలా విధులు నిర్వహించాలన్నారు. అధికారులు తమకు కేటాయించిన గ్రామపంచాయతీలలో ఎన్నికల కోసం అన్ని ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. ఓట్ల లెక్కింపులో పూర్తి పారదర్శకంగా వ్యవహరించాలని, పోలింగ్ కేంద్రంలో శాంతిభద్రతలపై పర్యవేక్షించాలని ఆదేశించారు.

