V6 News

అక్కాచెల్లి, అన్నాతమ్ముడి సవాల్‌‌‌‌‌‌‌‌.. ఆసిఫాబాద్ జిల్లా గడలపల్లి.. సుంగాపూర్ పంచాయితీల్లో ఎన్నికల హడావిడి

అక్కాచెల్లి, అన్నాతమ్ముడి సవాల్‌‌‌‌‌‌‌‌.. ఆసిఫాబాద్ జిల్లా గడలపల్లి.. సుంగాపూర్ పంచాయితీల్లో ఎన్నికల హడావిడి
  •     సర్పంచ్‌‌‌‌‌‌‌‌ ఎన్నికల్లో పోటీ చేస్తున్న కుటుంబసభ్యులు

తిర్యాణి, వెలుగు : కుమ్రంభీం ఆసిఫాబాద్‌‌‌‌‌‌‌‌ జిల్లా తిర్యాణి మండలంలో అక్కాచెల్లి, అన్నదమ్ముల మధ్య గ్రామ పంచాయతీ పోరు నడుస్తోంది. మండలంలో గడలపల్లి గ్రామంలో అక్కాచెల్లెలు ఆత్రం శంకరమ్మ, ఆత్రం విమల సర్పంచ్‌‌‌‌‌‌‌‌ బరిలో నిలువగా.. సుంగాపూర్ గ్రామపంచాయతీ సర్పంచ్‌‌‌‌‌‌‌‌ పదవి కోసం అన్నాతమ్ముళ్లు టెకం సురేశ్, టెకం మారుతీ పోటీ చేస్తున్నారు. ఒకే కుటుంబం నుంచి ఇద్దరిద్దరు పోటీ చేస్తుండడంతో ఎవరికి ఓటు వేయాలోనని కుటుంబసభ్యులు, బంధువులు ఆందోళన 
చెందుతున్నారు.