జ్వరంతో గురుకుల స్టూడెంట్ మృతి

జ్వరంతో గురుకుల స్టూడెంట్ మృతి

ఆసిఫాబాద్, వెలుగు: కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో తీవ్ర జ్వరంతో బాధపడుతూ ఓ గురుకుల స్టూడెంట్​ చనిపోయింది. వివరాల్లోకి వెళ్తే.. వాంకిడి మండల కేంద్రానికి చెందిన షేక్​అంజుమ్(15) ఆసిఫాబాద్​లోని బాబాపూర్​మైనారిటీ గురుకులంలో తొమ్మిదో తరగతి చదువుతోంది. ఈ నెల 19న జ్వరం రావడంతో క్లాస్ టీచర్ ఆమెకు ట్యాబ్లెట్లు ఇచ్చింది. 20న క్లాసులకు వెళ్లిన అంజుమ్​కు జ్వరం తగ్గకపోవడంతో స్కూల్​సిబ్బంది కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు.

అదే రోజు రాత్రి బాబాయి అష్రఫ్ వచ్చి అంజుమ్​ను ఇంటికి తీసుకెళ్లాడు. 21న ఆసిఫాబాద్​లోని ఓ ప్రైవేట్​హాస్పిటల్​లో చూపించినా, జ్వరం తగ్గలేదు. గురువారం ఉదయం మహారాష్ట్రలోని చంద్రపూర్ హాస్పిటల్ కు తీసుకెళ్తుండగా దారిలోనే అంజుమ్ చనిపోయింది. బాలిక మృతికి హాస్టల్ సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని, సరైన సమయంలో స్పందించలేదని కుటుంబ సభ్యులు ఆరోపించారు.