సిర్పూర్(టి)  ఫారెస్ట్లో ‘బైసన్’లు.. కెమెరాలో బంధించిన అధికారులు

సిర్పూర్(టి)  ఫారెస్ట్లో ‘బైసన్’లు.. కెమెరాలో బంధించిన అధికారులు

కాగజ్ నగర్, వెలుగు: ఆసిఫాబాద్​జిల్లా కాగజ్ నగర్ ఫారెస్ట్ డివిజన్ సిర్పూర్ (టి) రేంజ్ అడవీ ప్రాంతంలో బైసన్ లు తిరగడం అటవీ శాఖ అధికారుల కెమెరాకు చిక్కాయి. రేంజ్ లోని మాలిని ప్రాంతంలో ఓ బైసన్( ఇండియన్ గౌర్, అడవిదున్న) ను ఆఫీసర్లు కెమెరాలో బంధించారు. మరో బైసన్ నీటికుంట వద్ద నీళ్లు తాగేందుకు వచ్చి అక్కడ అమర్చిన కెమెరాలో రికార్డయ్యింది. సిర్పూర్ రేంజ్ అడవీ ప్రాంతంలో వన్యప్రాణుల సంరక్షణ, కదలికలను నిరంతరం మానిటర్ చేస్తూ ట్రాకింగ్, ట్రేసింగ్ చేస్తున్నామని ఇన్​చార్జ్ రేంజ్ ఆఫీసర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు.