అయ్యోపాపం : రైలు కింద పడి కానిస్టేబుల్ సూసైడ్..రామన్కాలనీ ఫ్లై ఓవర్ బ్రిడ్జి కింద ఘటన

అయ్యోపాపం : రైలు కింద పడి కానిస్టేబుల్ సూసైడ్..రామన్కాలనీ ఫ్లై ఓవర్ బ్రిడ్జి కింద ఘటన

కోల్​బెల్ట్, వెలుగు: మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలోని ఎర్రగుంటపల్లి గ్రామానికి చెందిన కానిస్టేబుల్​ రేండ్ల అరవింద్​యాదవ్(31) ఆదివారం వేకువజామున రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన రామన్​కాలనీ ఫ్లై ఓవర్​ బ్రిడ్జి కింద ఉన్న మూడో రైల్వే లైన్​పై జరిగింది.

 అరవింద్​యాదవ్ కుమ్రంభీం ఆసిఫాబాద్​ జిల్లా సిర్పూర్(టి)లో డ్యూటీ చేస్తున్నాడు. బ్లూ కోల్ట్స్​ విధుల్లో నిర్లక్షం కారణంగా మార్చి 5న సస్పెండ్​ అయ్యాడు. అప్పటి నుంచి మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న బెల్లంపల్లి రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని డెడ్​బాడీని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు  తెలిపారు.