
- ఘనంగా అంతర్జాతీయ పులుల దినోత్సవం
నెట్వర్క్, వెలుగు: అంతర్జాతీయ పులుల దినోత్సవాన్ని అటవీ శాఖ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరుపుకొన్నారు. పులుల రక్షణతో పర్యావరణ సమతుల్యత సాధ్యం అవుతుందని ఆసిఫాబాద్ ఎఫ్డీవో దేవిదాస్ అన్నారు. ఆసిఫాబాద్ లో చేపట్టిన బైక్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. పోడు సాగు వల్ల అటవీ విస్తీర్ణం తగ్గడంతో పులుల సంరక్షణ కష్టంగా మారిందన్నారు. అడవులను నరకకుండా వన్యప్రాణులను కాపాడాలన్నారు.
కాగజ్ నగర్, సిర్పూర్ టీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లు అనిల్ కుమార్, ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో ర్యాలీలు, కాగజ్నగర్ రెసిడెన్షియల్లో వ్యాస రచన పోటీలు నిర్వహించారు. శాఖాహార జంతువుల వేట, ఆవాసాల విధ్వంసం కారణంగా పులుల సంఖ్య తగ్గిపోయి అంతరించిపోయే దశలో ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలు వన్యప్రాణుల సంరక్షణకు కృషి చేయాలని కోరారు. తిర్యాణిలో ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించి, జడ్పీ స్కూల్లో మొక్కలు నాటారు.
స్టూడెంట్లకు ఈజీ రైటింగ్, డ్రాయింగ్ పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. పెంబిలోని జడ్పీ, ప్రైమరీ స్కూళ్లు, కాసిపేటలోని మోడల్ స్కూల్, కడెంలోని ప్రభుత్వ పాఠశాల, ఖానాపూర్లోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్, లక్సెట్టిపేటలోని గుడ్ షెఫర్డ్ స్కూళ్లలోపులుల ఆవశ్యకతపై వ్యాస రచన, డ్రాయింగ్, ఉపన్యాస పోటీలు నిర్వహించి గెలుపొందిన స్టూడెంట్లకు బహుమ తులు అందజేశారు.