ఇండియా కోసమైనా యుద్ధాన్ని ఆపించండి

ఇండియా కోసమైనా యుద్ధాన్ని ఆపించండి
  • పుతిన్​తో మాట్లాడాలంటూ ప్రధాని మోడీకి ఉక్రెయిన్​ విజ్ఞప్తి

కీవ్: ఇండియా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునైనా రష్యా అధ్యక్షుడు పుతిన్​తో మాట్లాడి యుద్ధాన్ని ఆపించాలంటూ ప్రధాని నరేంద్ర మోడీకి ఉక్రెయిన్​ విదేశాంగ మంత్రి దిమిత్రో కులేబా విజ్ఞప్తి చేశారు. యుద్ధాన్ని ఆపితేనే అన్ని దేశాలకూ మంచిదన్నారు. ‘‘ఉక్రెయిన్​లో పండించే పంటలను ఎక్కువగా ఇండియా దిగుమతి చేసుకుంటుంది. యుద్ధం ఇంకా కొనసాగితే దేశంలో పంటలు పండించడం కష్టమవుతుంది. కాబట్టి ఇండియా, ప్రపంచ ఆహార భద్రతను దృష్టిలో పెట్టుకుని యుద్ధాన్ని ఆపించాలి’’ అని ఆయన కోరారు. ఇండియా సహా రష్యాతో మంచి సంబంధాలున్న దేశాల నాయకులు పుతిన్​తో మాట్లాడాలన్నారు. ఇండియన్ పౌరులూ దీనిపై ఒత్తిడి తేవాలని విజ్ఞప్తి చేశారు.