కోల్‌బెల్ట్, వెలుగు: మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ సింగరేణి ఠాగూర్ స్టేడియంలో సోమవారం అస్మిత ఖేలో ఇండియా అండర్–16 గర్ల్స్ ఫుట్‌బాల్ ఛాంపియన్–2026 పోటీలు సోమవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలోని 8 ఉమ్మడి జిల్లాలకు చెందిన 180 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పోటీలను నిర్వహిస్తున్నారు. పోటీలను మందమర్రి సీఐ పర్స రమేశ్, సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం(ఏఐటీయూసీ) స్టేట్ ప్రెసిడెంట్ వాసిరెడ్డి సీతారామయ్య, రాష్ట్ర ఫుట్‌బాల్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ఫాల్గుణ ప్రారంభించారు.
క్రీడల్లో గెలుపోటములు పట్టించుకోకుండా క్రీడాస్ఫూర్తిని చాటాలని వారు సూచించారు. ప్రతిరోజు 8 మ్యాచ్‌ల చొప్పున మూడు రోజుల పాటు టోర్నీ జరుగుతుందని, ఈ నెల 29న విజేతలకు రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి బహుమతులు అందజేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. క్యాతనపల్లి మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ గొడిసెల సంధ్యారాణి, వైస్ చైర్పర్సన్ మిట్టపల్లి సరిత, టౌన్ ఎస్సై శ్రీధర్, నిర్వాహకులు పల్లె రాజు, ఒడ్నాల శ్రీనివాస్ పాల్గొన్నారు. -తొలి రోజు పోటీల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జట్లు రెండు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించింది.

