మానవ అక్రమ రావాణా నేరం :ఏఎస్పీ చిత్త రంజన్

మానవ అక్రమ రావాణా నేరం :ఏఎస్పీ చిత్త రంజన్

జైనూర్, వెలుగు: మానవ అక్రమ రవాణా నేరమని ఏఎస్పీ చిత్తరంజన్​తెలిపారు. దీనిపై శుక్రవారం జైనూర్ వ్యవసాయ మార్కెట్ యార్డులో డీఆర్‌డీఏ, ప్రజ్వల స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. అనంతరం విద్యార్థులతో కలిసి ర్యాలీ తీశారు. జైనూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ విశ్వనాథ్ రావు, సీఐ రమేశ్, జైనూర్, సిర్పూర్(యు), లింగాపూర్ ఎస్సైలు, ప్రజ్వల సంస్థ జాయింట్ డైరెక్టర్ అహ్మద్ అలీ తదితరులు పాల్గొన్నారు.