
మెదక్ టౌన్, వెలుగు: బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించాలని ఏఎస్పీ మహేందర్ పిలుపునిచ్చారు.సోమవారం జిల్లా ఎస్పీ ఆఫీసులో ఆపరేషన్ ముస్కాన్ సమావేశాన్ని నిర్వహించారు. ఏఎస్పీ మాట్లాడుతూ.. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.
జిల్లా వ్యాప్తంగా వివిధ పరిశ్రమలు, వ్యాపార సముదాయాల్లో దాడులు నిర్వహించాలని అధికారులకు సూచించారు. ఎక్కడైనా బాలకార్మికులు కనిపిస్తే వెంటనే 100, 1098కు సమాచారం అందించాలన్నారు. సమావేశంలో డీడబ్ల్యూవో హైమావతి, ఆర్డీవో రమాదేవి, సురేశ్ బాబు, జ్ఞానజ్యోతి, కరుణ శ్రీ, ప్రసాద్, పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.