అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు విద్యార్థులు మృతి

  అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు విద్యార్థులు మృతి

అస్సాంలో మే 29న అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గువాహటిలోని జలుక్బరీ వద్ద డివైడర్ ను ఓ కారు ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ఘటనలో ఏడుగురు విద్యార్థులు మరణించారు. కారుపై డ్రైవర్ కంట్రోల్ కోల్పోవడంతోనే ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు తెలిపారు.

ఈ ఘటనలో మృతి చెందిన విద్యార్థులు అస్సాం ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. వారిలో గౌహతికి చెందిన అరిందమ్ భోవల్, నియోర్ దేకా, శివసాగర్ నుంచి కౌశిక్ మోహన్, నాగోన్ నుంచి ఉపాంగ్షు శర్మ, మజులికి చెందిన రాజ్ కిరణ్ భుయాన్, డిబ్రూఘర్ నుంచి ఎమోన్ బారువా, మంగళ్‌దోయికి చెందిన కౌశిక్ బారుహ్ ఉన్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం ప్రమాదం జరిగిన సమయంలో వాహనంలో పది మంది ఉన్నారు. ఈ పది మందిలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండడంతో వెంటనే గౌహతి మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్ (జీఎంసీహెచ్)కి తరలించారు. 

https://twitter.com/ANI/status/1663008665325162496